Amazon Mobile Offers: ఆఫర్లు అదిరాయ్ గురూ.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అసలు ఊహించలేరు..!

Amazon Mobile Offers: రెడ్‌మి తన కొత్త బడ్జెట్ 5G ఫోన్ Redmi A5 ను ఏప్రిల్ 15న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. Redmi A4 సక్సెసర్‌గా బ్రాండ్ ఈ మొబైల్‌ని పరిచయం చేయనుంది.

Update: 2025-04-13 09:00 GMT
Amazon Mobile Offers

Amazon Mobile Offers: ఆఫర్లు అదిరాయ్ గురూ.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అసలు ఊహించలేరు..!

  • whatsapp icon

Amazon Mobile Offers: రెడ్‌మి తన కొత్త బడ్జెట్ 5G ఫోన్ Redmi A5 ను ఏప్రిల్ 15న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. Redmi A4 సక్సెసర్‌గా బ్రాండ్ ఈ మొబైల్‌ని పరిచయం చేయనుంది. ఇదిలా ఉండగా, కొత్త రెడ్‌మి ఫోన్ లాంచ్‌కు ముందు, రెడ్‌మి A4 ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో కనిపించింది.మీరు బడ్జెట్ ధరకు మంచి 5G ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు గొప్ప ఎంపిక. మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 9,000 కంటే తక్కువ ధరకు మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ Redmi A4 పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్లు, ఫీచర్లు గురించి వివరంగా తెలుసుకుందాం.

Redmi A4 5G Amazon Offers

రెడ్‌మి A4 5G 4GB + 64GB వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో 23 శాతం తగ్గింపుతో కేవలం రూ. 8499 కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇతర వినియోగదారులకు 3శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఈఎమ్ఐ ఆర్డర్లు, అమెజాన్ బిజినెస్ లావాదేవీలకు వర్తించదు.

Redmi A4 5G Features And Specifications

ఈ స్మార్ట్‌ఫోన్ అధిక పనితీరుతో వస్తుంది, స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 5G ప్రాసెసర్‌ ఉంది. ఇందులో 6.9 అంగుళాల డిస్‌ప్లు ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. TUV ద్వారా ట్రిపుల్ సర్టిఫైడ్ ఐ-కేర్ ప్రొటెక్షన్‌తో ఈ డిస్‌ప్లే కళ్లను సురక్షితంగా ఉంచుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ వరకు ర్యామ్ ఉంది.ఇందులో 4జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. 64జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. దీనిని మైక్రో SD కార్డ్ సహాయంతో 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5160mAh బ్యాటరీ ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ బాక్స్ లో USB టైప్-C పోర్ట్ తో పాటు 33W ఛార్జర్ కూడా అందుబాటులో ఉంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్, తాజా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Tags:    

Similar News