WhatsApp: వాట్సాప్ అదిరిపోయే అప్డేట్.. స్టేటస్‌తోపాటే సాంగ్ కూడా ఇలా యాడ్ చేసుకోండి..!
Whatsapp Add Music Update: వాట్సాప్ లో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. యూజర్లకు మరింత సులభంగా స్టేటస్ అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఆ ఫీచరు మీరు తెలుసుకోండి.

WhatsApp: వాట్సాప్ అదిరిపోయే అప్డేట్.. స్టేటస్‌తోపాటే సాంగ్ కూడా ఇలా యాడ్ చేసుకోండి..!
Whatsapp Add Music Update: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ అప్డేట్స్ అందిస్తున్న వాట్సాప్ మరో నయా ఫీచర్ తో యూజర్లను ఆకట్టుకుంటుంది. వాట్సాప్ స్టేటస్ పెట్టుకునే వారికి సాంగ్ కోసం ఇక థర్డ్ పార్టీ ఆప్షన్ వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వాట్సాప్ లోనే సాంగ్ కూడా యాడ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఇది ఫోటోతో పాటు వీడియో కూడా వర్తిస్తుంది. దీంతో యూజర్ల పండగ చేసుకుంటున్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్టేటస్‌లో ఇలా పాటల్ని కూడా యాడ్ చేసుకునే సౌకర్యం కల్పించి ఆశ్చర్చపరిచింది. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి ఆప్షన్ ఉంటుంది. స్టోరీ అప్లోడ్ చేసేటప్పుడు సులభంగా అక్కడ సాంగ్స్ ఎంచుకునే సౌకర్యం కూడా కల్పించేది. కానీ ఇదివరకు వాట్సాప్ ఇలా ఉండేది కాదు.. కానీ ఇప్పుడు 24 గంటల పాటు ఫోటోలు, వీడియోలు సాంగ్స్ తో పాటు పాటలు యాడ్ చేసుకునే సౌకర్యం కల్పించింది ప్రముఖ మెసేజింగ్ యాప.
మీరు కూడా మీ స్టేటస్‌కు మ్యూజిక్ యాడ్ చేయాలంటే..
వాట్సాప్‌లో యాడ్ వాట్సాప్ స్టేటస్‌లోకి వెళ్లి అక్కడ మీకు కావాల్సిన ఫోటో లేదా వీడియో సెలెక్ట్ చేసుకోండి. అక్కడే పై భాగంలో మ్యూజిక్ సింబల్ కూడా పొందుపరిచారు. అందులో మీకు కావలసిన పాటను టైప్ చేసి ఎంచుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఇక్కడ స్టిక్కర్స్, టెక్స్ట్, ఎడిట్ ఆప్షన్లు కూడా స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఈ మ్యూజిక్ ఐకాన్ సరికొత్తగా చేర్చింది వాట్సాప్ . ఇక్కడ ఫోటోకు మీరు 15 సెకండ్ల పాటు పాటను యాడ్ చేసుకోవచ్చు. వీడియోకి 60 సెకండ్ల యాడ్ చేసుకునే సౌకర్యం కల్పించింది.