Jio: అయ్య బాబోయ్.. ఈ జియో 72 రోజుల ప్లాన్ తో 20 జీబీ డేటా బోనస్‌..

Jio 72 Days Plan: ప్రైవేటు దిగ్గజ కంపెనీ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 జీబీ డేటా బోనస్‌గా పొందుతారు. జియో కస్టమర్‌లకు ఇది బంపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Update: 2025-04-01 12:50 GMT

Jio: అయ్య బాబోయ్.. ఈ జియో 72 రోజుల ప్లాన్ తో 20 జీబీ డేటా బోనస్‌..

Jio 72 Days Plan: జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. రిలయన్స్ ఈ ప్రైవేట్ దిగ్గజ కంపెనీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు మార్కెట్‌లో ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడు జియో 460 మిలియన్ పైగా కస్టమర్లను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వివిధ ప్లాన్లను పరిచయం చేస్తోంది జియో. ఈ ప్రైవేటు దిగ్గజ కంపెనీ కస్టమర్‌లకు ఆకర్షణీయమైన ప్లాన్లు తీసుకువచ్చింది. బడ్జెట్‌లో అందుబాటులో ఉండే ప్లాన్స్‌ కస్టమర్‌లకు పరిచయం చేస్తోంది.

ఇటీవల జియో మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 20 జీబీ డేటా బోనస్‌గా అందిస్తోంది. దీంతోపాటు ఉచిత వాయిస్‌ కాలింగ్‌ కూడా ఉంటుంది. ఇప్పటికే ఓటీటీలను కాంప్లిమెంటరీగా అందిస్తున్న జియో. తాజాగా డేటాను కూడా అందిస్తూ ఉండటంతో ఎక్కువ మంది కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు. ఈ ప్యాక్ తో రీచార్జ్ చేసుకుంటే ఫ్రీ మొబైల్ కాలింగ్‌తోపాటు మరిన్ని బెనిఫిట్స్‌ పొందుతారు.

జియో రూ.749 ప్లాన్..

రిలయన్స్ జియో అందిస్తున్న 72 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర కేవలం రూ.749 మాత్రమే. ఇది బడ్జెట్‌ ఫ్రెండ్లీలో అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు లోకల్, ఎస్టీడీ ఏ నెట్‌వర్క్ అయినా కాల్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఇందులో అదనంగా 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లు కూడా పొందుతారు.

జియో అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్‌లో 164 జీబీ డేటా పొందుతారు. ఇది 72 రోజుల పాటు వ్యాలిడిటీ అందుతుంది. అంటే ప్రతిరోజు 2gb డేటా పొందుతారు. అయితే డేటా లిమిట్ అయిపోయిన తర్వాత కూడా మీకు 64 కేబీపీఎస్ డేటా పొందుతారు.. అయితే జియో ఇందులో మీకు అదనంగా బోనస్ కూడా ఇస్తుంది అదే 20 జీబీ డేటా అదనంగా పొందుతారు.

రూ.749 ప్లాన్ తో మీరు రీచార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో మీకు ఏఐ క్లౌడ్‌ స్టోరేజ్ 50gb పొందుతారు. జియో హాట్ స్టార్ కూడా అదనంగా లభిస్తుంది. కాంప్లిమెంటరీగా జియో టీవీ యాక్సెస్ కూడా పొందుతారు. దీనికి మీరు అదనంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

Tags:    

Similar News