Infinix Note 50X 5G Plus: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్.. ధర చాలా తక్కువ..!

Infinix Note 50X 5G Plus: స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'Infinix Note 50X 5G Plus' పేరుతో ఈ మొబైల్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 3,న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌కి వస్తుంది.

Update: 2025-03-31 15:30 GMT

Infinix Note 50X 5G Plus: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్.. ధర చాలా తక్కువ..!

Infinix Note 50X 5G Plus: స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'Infinix Note 50X 5G Plus' పేరుతో ఈ మొబైల్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 3,న మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌కి వస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ , కంపెనీ అధికారిక సైట్ నుండి కొనుగోలు చేయచ్చు. మీరు ఈ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

ఇన్ఫినిక్స్ ప్రకారం.. నోట్ 50X 5జీ ప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌తో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్. ధర గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ రెండు వేరియంట్లలో విడుదల కానుంది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.15 వేల లోపే ఉండచ్చు.

Infinix Note 50X 5G Plus Price And Offers

దీని 6GB + 128GB వేరియంట్ ధర రూ. 11,499. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 12,999. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లతో పరిచయం చేశారు. వేగన్ లెదర్ ఫినిషింగ్ సీ బ్రీజ్ గ్రీన్, టైటానియం గ్రే, ఎన్‌చాన్టెడ్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. ఇది కాకుండా, మెటాలిక్ ఫినిషింగ్‌తో మరో రెండు కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్‌ని మొదటి సేల్ సమయంలో నేరుగా రూ. 1000 తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. ఈ తగ్గింపు బ్యాంక్ లేదా ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద అందుబాటులో ఉంటుంది. రూ. 11,499 ధర గల ఫోన్‌ను రూ. 10,499కి రూ. 1000 తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు.

Infinix Note 50X 5G+ Features

స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే ఫోన్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, AI లెన్స్‌తో ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీ ఉంది.



Tags:    

Similar News