Suzuki Burgman: సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 అప్‌డేట్ వెర్షన్.. కొత్త స్టైల్, ఫీచర్స్ అదిరిపోయాయ్..!
Suzuki Burgman: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఇటీవలే బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది.

Suzuki Burgman: సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 అప్‌డేట్ వెర్షన్.. కొత్త స్టైల్, ఫీచర్స్ అదిరిపోయాయ్..!
Suzuki Burgman: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఇటీవలే బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. ఇందులో కొత్త కలర్ స్కీమ్, OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇంజన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కూటర్ అప్‌గ్రేడ్ వేరియంట్ మొదటిసారిగా టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది 2025 సుజుకి యాక్సెస్ 125 లాగా, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 కూడా కొన్ని డిజైన్ మార్పులు, ఫాస్ట్ యాక్సిలరేషన్, మెరుగైన ఇంధన సామర్థ్యం వంటి అప్‌డేట్‌లను పొందే అవకాశం ఉంది.
బర్గ్‌మాన్ స్ట్రీట్ రాబోయే వేరియంట్ దాని మాక్సీ-స్కూటర్ స్టైలింగ్‌ను నిలుపుకుంటూ తేలికపాటి డిజైన్‌తో వస్తుందని భావిస్తున్నారు. కానీ దాని సిల్హౌట్ ప్రస్తుత మోడల్‌ని పోలి ఉంటుంది. ఫ్రంట్ ఫెయిరింగ్ అదే బోల్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే టెయిల్ విభాగం కొంచెం సన్నగా ఉన్నట్లు కనిపిస్తుంది, ఇది సుజుకి అవెనిస్‌ను పోలి ఉంటుంది. అదనంగా టెస్టింగ్ మోడల్‌లో క్రోమ్-యాక్సెంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కనిపిస్తుంది. కొత్త సుజుకి యాక్సెస్ 125లో ఉపయోగించిన ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను పోలి ఉంటుంది.
బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 రాబోయే వేరియంట్ ప్రస్తుత మోడల్‌లోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండవచ్చు. ప్రస్తుత మోడల్‌లో ఇప్పటికే బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లతో పాటు, పాసింగ్ లైట్లు, హజార్డ్ ల్యాంప్స్, రియర్ బ్రేక్ లాక్ వంటి అదనపు ఫీచర్లను కొత్త మోడల్‌కు ఉండచ్చు. ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
OBD-2B నిబంధనలకు అనుగుణంగా సుజుకి ఇప్పటికే ఇంజన్‌ను అప్‌డేట్ చేసింది. కొత్త వేరియంట్‌లో 124సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. 8.58 బిహెచ్‌పి పవర్, 10 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హార్డ్‌వేర్ సెటప్ కూడా మారే అవకాశం తక్కువగా ఉంటుంది.
బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 భారతదేశంలో మొదటిసారిగా 2018లో ప్రారంభించారు. అప్పటి నుండి దాని అసలు స్టైలింగ్‌ను అలాగే ఉంది. ప్రస్తుత మోడల్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, దీని ప్రారంభ ధర రూ. 95,800 ఎక్స్-షోరూమ్. భారతదేశంలో ఈ అప్‌గ్రేడ్ వెర్షన్ త్వరలో విడుదల కావచ్చు. అయితే దీని ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండచ్చు.