Samsung Galaxy Watch 8: సామ్‌సంగ్ నుంచి మరో నయా స్మార్ట్‌వాచ్.. మీ చేతికి స్మార్ట్‌గా చేస్తుంది..!
Samsung Galaxy Watch 8: దేశంలో యువత ఇటీవల కాలంలో ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్‌ను వాడుతున్నారు. టెక్ కంపెనీలు కూడా అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి.
Samsung Galaxy Watch 8: సామ్‌సంగ్ నుంచి మరో నయా స్మార్ట్‌వాచ్.. మీ చేతికి స్మార్ట్‌గా చేస్తుంది..!
Samsung Galaxy Watch 8: దేశంలో యువత ఇటీవల కాలంలో ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్‌ను వాడుతున్నారు. టెక్ కంపెనీలు కూడా అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు టెక్ దిగ్గజం సామ్‌సంగ్ 'Galaxy Watch 8' సిరీస్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది గెలాక్సీ వాచ్ 7 లైనప్ సక్సెసర్‌గా వస్తుందని భావిస్తున్నారు. తాజాగా వాచ్ 8 దక్షిణ కొరియా సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో EB-BL330ABY, BL505ABY మోడల్ నంబర్‌లతో కనిపించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 8 సిరీస్‌లో రెండు స్మార్ట్‌వాచ్‌లు.. గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ ఉంటాయి. ఇవి EB-BL330ABY, EB-BL505ABY మోడల్ నంబర్‌తో సేఫ్టీకొరియా వెబ్‌సైట్ ద్వారా బ్యాటరీ సర్టిఫికేషన్ దక్కించుకున్నాయి. రిజిర్టిఫికేషన్ కోసం దరఖాస్తును టెక్ కంపెనీ బ్యాటరీ తయారీ విభాగం సామ్‌సంగ్ ఎస్‌డిఐ దాఖలు చేసింది.
టీయూవీ రైన్‌ల్యాండ్ ఆమోదించిన మరొక సర్టిఫికేషన్ ప్రకారం.. సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 8 వేరియంట్ 435mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. అలానే జిఎస్ఎమ్ఏ డేటాబేస్ గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ SM-L505U మోడల్ నంబర్‌తో వస్తుందని సూచిస్తుంది. వాచ్ డిస్‌ప్లే కూడా గెలాక్సీ వాచ్7, గెలాక్సీ అల్ట్రా మోడల్‌లతో సమానంగా ఉంటుంది. సామ్‌సంగ్ మునుపటి ‘క్లాసిక్’ స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ తిరిగే బెజెల్స్‌తో వస్తుందని టె్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నివేదికలు సామ్‌సంగ్ తన రాబోయే లైనప్‌తో క్లాసిక్ మోడల్‌ను తిరిగి తీసుకురావడాన్ని కూడా సూచిస్తున్నాయి. అయితే కంపెనీ గత సంవత్సరం జూలైలో విడుదల చేసిన గెలాక్సీ వాచ్ 7 సిరీస్‌లో క్లాసిక్, ప్రో ఎడిషన్‌లను విడుదల చేయలేదు. బదులుగా గెలాక్సీ వాచ్ 7 , కొత్త గెలాక్సీ వాచ్ అల్ట్రాను ప్రవేశపెట్టింది. అల్ట్రాను యాపిల్ వాచ్ అల్ట్రాకు పోటీగా రిలీజ్ చేసింది.