Science News: జీవతాన్ని నడిపించే శక్తి కేవలం అవకాశాల్లో కాదు.. ప్రతికూలతలలో కూడా దాగి ఉంటుంది.. సైన్స్ చెప్పే సత్యమిదే!

Science News: కాంబ్రియన్ యుగంలో రోజువారీ ఆక్సిజన్ మార్పులు జీవవైవిధ్య విస్ఫోటానికి కారణమయ్యాయి

Update: 2025-03-25 04:30 GMT
Science News

Science News: జీవతాన్ని నడిపించే శక్తి కేవలం అవకాశాల్లో కాదు.. ప్రతికూలతలలో కూడా దాగి ఉంటుంది.. సైన్స్ చెప్పే సత్యమిదే!

  • whatsapp icon

Science News: 50లక్షల ఏళ్ల క్రితం, సముద్రపు ఉపరితలంపై జీవాలు ఊహించలేని పరిస్థితుల నడుమ మెల్లగా మేల్కొంటున్నాయి. ఓ వైపు పొద్దుపోయే సమయంలో సముద్రం ఆక్సిజన్‌తో నిండిపోతుంటే, మరోవైపు రాత్రి ఎలాంటి గాలిలేని అనాక్సిక్ నిర్జీవ ప్రపంచంగా మారుతుంది. ఇవే జీవాలకు ప్రతిరోజూ ఎదురయ్యే దెబ్బలు.

ఈ ఆటుపోట్లు, అక్షరాలా ఉనికి కోసం జరిగే యుద్ధం. జీవాలు ఈ కఠిన పరిస్థితులను తట్టుకునేందుకు కొత్త పద్ధతులను అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చింది. ఆక్సిజన్‌ను గుర్తించి స్పందించే విధానాలు, మలినాలు తట్టుకునే శక్తి.. ఇవన్నీ అంతకాలంలోనే ఆవిర్భవించాయి. ఈ పరిణామమే తరువాతి కాలంలో భారీ జీవరాశుల ఉద్భవానికి బీజం వేసింది.

రొడినియా అనే సూపర్‌కాంటినెంట్ విడిపోయి చిన్న ఖండాలుగా మారింది. దీంతో తీర ప్రాంతాలు పెరిగాయి. ఈ సూర్యరశ్మితో నిండిన తీరాలలో జీవం వృద్ధి చెందే అవకాశాలు పెరిగాయి. కానీ, ఆ అవకాశం అందరికీ కాదు. ఎవరు ఆ రోజు-రాత్రి ఆక్సిజన్ ఆటుపోట్లను తట్టుకుంటారో వారికే పోటీ గెలిచే ఛాన్స్! ఈ ఒత్తిడి ఒక శాపంలా కనిపించినా చివరకు ఒక వరమయ్యింది. ఎందుకంటే, కేవలం సౌకర్యాల వల్ల కాకుండా, కఠినతల వల్ల జీవవికాసం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంది.

Tags:    

Similar News