BSNL KYC: బీఎస్ఎన్‌ఎల్ సిమ్ వాడుతున్నారా? ఈ పని వెంటనే చేయండి సిమ్ బ్లాక్ అయిపోద్ది, ఇది నిజమేనా?
BSNL SIM KYC: మీరు బీఎస్ఎన్‌ఎల్ సిమ్ వాడుతున్నారా? అయితే, వెంటనే ఈ పనిచేయండి. లేకపోతే మీ సిమ్ కార్డు బ్లాక్ అయిపోద్ది. ఇది నిజమేనా?

BSNL KYC: బీఎస్ఎన్‌ఎల్ సిమ్ వాడుతున్నారా? ఈ పని వెంటనే చేయండి సిమ్ బ్లాక్ అయిపోద్ది, ఇది నిజమేనా?
BSNL SIM KYC: గత ఏడాది జూన్‌లో పెరిగిన టెలికాం ధరల తర్వాత చాలామంది ఇతర ప్రైవేటు కంపెనీ సిమ్ కార్డు యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. కొన్ని మిలియన్ల మంది ఈ ప్రభుత్వం దిగ్గజ కంపెనీ ఖాతాలో చేరిపోయారు. అయితే, మీరు కూడా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు యూజర్లు అయితే మీకు బిగ్ అలెర్ట్. వెంటనే ఈ పని పూర్తి చేయండి. లేకపోతే మీ బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుంది.
మీ వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు అయితే, సిమ్ యాక్టివేషన్ అయిన 24 గంటల్లోనే కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. లేకపోతే సదరు సిమ్ కార్డును వెంటనే డియాక్టివేట్ చేయాలని ఆదేశించింది. ఇటీవలె చాలామందికి బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు యూజర్లకు ట్రయ్ కూడా నోటిసులు జారీ చేసింది. వెంటనే వారిని కేవైసీ పూర్తి చేసుకోమని ఆదేశించిందని తెలిసింది.
అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఎలాంటి నోటీసులు పంపించలేదు. స్కామర్స్ ఇలా మెసేజ్‌లు పంపి యూజర్ల డేటాను చోరీ చేస్తున్నారు. కేవైసీ పేరుతో కొత్త తరహా మోసాలకు దిగారు. అందుకే కేవలం అధికారిక ఛానల్ నుంచి మెసేజ్‌లు వస్తే మాత్రమే స్పందించాలని సూచించింది. దీనిపి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా చేసింది.
ప్రజలను మోసం చేయాలని మోసపూరిత విధానాలను ఎంచుకుంటున్నారు స్కామర్స్. వెంటనే ఆధార్ కార్డు, ఇతర వివరాలు పంపించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత సందేశాలను నమ్మకూడదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DOT) చెప్పింది. తాజాగా కాల్ మెర్జింగ్ విధానంతో మోసాలకు తెగపడుతున్నారు. తెలిపిన వ్యక్తిలా కాల్ చేసి నమ్మించి వారి నంబర్‌ను విలీనం (Merge) చేయమని చెబుతున్నారు. ఒక్కసారి కాల్ మెర్జ్ చేస్తే మీ వాయిస్ కాల్, ఓటీపీలు కూడా తస్కరించడం ఖాయం.