AC: ఏసీలు ఆన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు ఊఫ్..
AC Blast Reasons: ఎండాకాలం మొదలైంది. వేడిమి పెరగడంతో కూల్ వాటర్, గాలి కోసం తహతహలాడుతుంటారు. ఈ నేపథ్యంలో కూలర్లు ఏసీల వినియోగం కూడా పెరుగుతుంది.

AC: ఏసీలు ఆన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు ఊఫ్..
AC Blast Reasons: మీరు కూడా ఏసీలు ఆన్ చేస్తున్నారా? లేదా కొత్తది కొనుగోలు చేస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి. లేకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది. మండే ఎండాకాలం చల్లదనం కోసం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లపై ఆధారపడతారు. అయితే, ఏసీలు ఆన్ చేస్తే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోండి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇది వరకు ఏసీలు ఉంటే ఈ ఎండాకాలం వాటిని మళ్లీ ఉపయోగించాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు ముందుగా పాటించండి.
మీ ఇంట్లో ఉన్న ఏసీ ఇప్పుడు ఉపయోగించడం మొదలు పెట్టాలనుకుంటే ముందుగా దాన్ని ఏసీ మెకానిక్ చేత టెస్ట్ చేయించండి. దాన్ని వైరింగ్ వ్యవస్థను టెస్ట్ చేయించండి. ఢిల్లీలో ఇటీవలె ఓ ఏసీ మెకానిక్ షాపులోనే వైరింగ్ వ్యవస్థ సరిగ్గా లేక ఏసీ పేలిపోయి ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ ఫూటేజీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో నెట్టింటా వైరల్ కూడా అయింది. అయితే, ఏసీ వాడే ముందు మీరు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.
అంతేకాదు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏడాదికి రెండుసార్లు ఏసీ వాడటం పూర్తయిన సమయంలో అంటే వానాకాలం ముందు ఏసీలు సర్వీసింగ్ చేయించాలి. మళ్లీ ఎండాకాలం ప్రారంభంలో కూడా ఏసీ సర్వీసింగ్ చేయించాలి. తద్వారా డస్ట్ ఫిల్టర్స్ క్లీన్ ఉంటాయి. ఏసీ వల్ల ఎలాంటి ప్రమాదకర ఘటనలు కూడా సంభవించవు.
ఏసీ వాడే ముందు అందులో కూలింగ్ గ్యాస్ లెవల్స్ కూడా ముఖ్యం. లేకపోతే ఆ గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఏసీ ఎక్కువసేపు ఆన్ చేయడం వల్ల దాన్ని లోడ్ టర్బో మోడ్‌లో ఉన్నప్పుడు మోటర్ పై ఎక్కువ పడుతుంది. సాధ్యమైనంత వరకు స్టెబిలైజర్ వినియోగించాలి. దీంతో పవర్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కూడా ఏసీ పేలిపోయే అవకాశం ఉండదు.
ఓల్టేజీలో మార్పులు ఉన్నప్పుడు వెంటనే ఏసీ కూడా పేలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఎప్పటికప్పుడు సాకెట్లు కూడా టెస్ట్ చేయించండి. దీంతో కూడా షాక్ సర్క్యూట్ సంభవించే అవకాశం ఉంది. వాటిని ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించండి.