WiFi Router: రాత్రిపూట వైఫై రూటర్ ఆన్‌లో ఉంటుందా.. అయితే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిందే..!

WiFi Router: ఈ రోజుల్లో చాలామంది ఇండ్లలో వైఫై రూటర్‌ని వాడుతున్నారు.

Update: 2023-06-11 14:30 GMT

WiFi Router: రాత్రిపూట వైఫై రూటర్ ఆన్‌లో ఉంటుందా.. అయితే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిందే..!

WiFi Router: ఈ రోజుల్లో చాలామంది ఇండ్లలో వైఫై రూటర్‌ని వాడుతున్నారు. దీంతో 24 గంటలు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. నచ్చిన సినిమాలు, గేమ్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నారు. వైఫై రూటర్‌ వల్లనే ఇది మొత్తం సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇది వేగవంతమైన ఇంటర్నెట్‌ని అందిస్తుంది. అయితే దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంట్లో రాత్రిపూట కూడా వైఫై రూటర్‌ రన్ అవుతుంటే ఎలాంటి నష్టాలుంటాయో ఈరోజు తెలుసుకుందాం.

నిద్రను కోల్పోయే ప్రమాదం

వైఫై రూటర్ రాత్రిపూట రన్ అవుతుంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిద్వారా వెలువడే రేడియేషన్ మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. రాత్రంతా వైఫై నడిచే ఇంట్లో చాలామంది నిద్రకు సంబంధించిన సమస్యలని ఎదుర్కొంటారు. కానీ ప్రజలు దీని గురించి అర్థం చేసుకోలేరు. ఇది చాలా కాలంపాటు ఇలాగే జరిగితే నిద్రలేమి సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు కొన్నిసార్లు ఈ సమస్యని తగ్గించుకోవడానికి మందులు కూడా వాడాల్సి ఉంటుంది. అందుకే రాత్రిపూట వైఫై రూటర్‌ని ఆఫ్‌ చేయడం ఉత్తమం.

వ్యాధుల ప్రమాదం ఎక్కువ

వైఫై రూటర్ రాత్రిపూట రన్ అవుతుంటే దాని నుంచి వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలు శరీరంలో అనేక వ్యాధులకి కారణం అవుతాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి శరీరంపై చెడు ప్రభావం చూపుతాయి. ఈ వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే వైఫై అవసరం ముగిసిన తర్వాత వైఫై రూటర్‌ను ఆపివేయాలి. చాలామందికి దీని గురించి తెలియదు. అందుకే దీనిపై అవగాహన కలిగి ఉండటం అత్యవసరం.

Tags:    

Similar News