Viral: మెట్రోలో టవల్స్‌ చుట్టుకొని అమ్మాయిల రచ్చ.. లాస్ట్‌లో అసలు ట్విస్ట్‌

Update: 2024-12-02 15:45 GMT

Four women travelling in metro with bath towels: సోషల్‌ మీడియాలో ఎలాగైనా ట్రెండ్‌ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. పుర్కెకో బుద్ధి అన్నట్లు కొంగొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరైతే రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో జరుగుతోన్న రచ్చ అంతా ఇంత కాదు. హైదరాబాద్ మొదలు ఢిల్లీ వరకు మెట్రోల్లో రకరకలా ఫీట్లు చేస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నారు.

అయితే ఇది కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడినట్లే విదేశాల్లో కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా కొందరు అమ్మాయిలు చేసిన రచ్చ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. నలుగురు అమ్మాయిలు స్నానం చేసిన తర్వాత ఉపయోగించే బాత్‌ టవల్స్‌ను చుట్టుకొని మెట్రోలోకి ఎంట్రీ ఇచ్చారు. ర్యాంప్‌ వాక్‌ చేస్తూ నానా హంగామా చేశారు.

దీంతో మెట్రోలో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వారిని ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరైతే ఏకంగా వారితో సెల్ఫీలు తీసుకున్నారు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేం మాయ రోగం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే ఆ నలుగురు అమ్మాయిలు చివర్లో అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చారు. మెట్రో స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాక చుట్టుకున్న టవల్‌ను తీసేశారు. అప్పుడే తెలిసింది అసలైన ట్విస్ట్‌. నిజానికి ఆ అమ్మాయిలు లోపల డ్రస్‌లు ధరించే బయట నుంచి టవల్‌ చుట్టుకున్నారు. ఎట్టకేలకు మేం సరైన సమయానికి చేరుకున్నాం అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్‌ చేశారు. దీంతో ఇదంతా కేవలం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడానికే చేశారని స్పష్టమవుతోందన్నమాట.

Tags:    

Similar News