Can you find out mistakes in this Photo puzzle: సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోన్న అంశాల్లో ఆప్టికల్ ఇల్యూజన్ కూడా ఒకటి. ప్రస్తుతం ఇలాంటి ఫొటోలకు నెట్టింట బాగా క్రేజ్ లభిస్తోంది. ముఖ్యంగా కంటి చూపుతో పాటు మన ఆలోచన శక్తిని పరీక్షించే ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ పజిల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఓ కుర్రాడు ఐస్ స్కేటింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది కదూ!
అయితే ఇందులోనే ఓ తప్పు దాగి ఉంది. నిజానికి ఇదొక బ్లెండర్ మిస్టేక్. ఆ మిస్టేక్‌ను 10 సెకండ్లలో కనిపెట్టడమే ఈ టాస్క్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ మీరు ఈ పజిల్ సాల్వ్ చేశారా? లేదా? అయితే ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనించండి. కుర్రాడి డ్రస్, క్యాప్, వెంట ఓ శునకం ఇలా అన్ని బాగానే ఉన్నాయి కదూ! అయితే ఇందులోనే ఓ తప్పు దాగి ఉంది. జాగ్రత్తగా గమనిస్తే ఆ తప్పు కనిపిస్తుంది.
పది సెకండ్లలో ఆ తప్పును గుర్తిస్తే మీ ఐ పవర్ సూపర్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ తప్పును గుర్తించారా? ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న తప్పు ఏంటంటే.. కుర్రాడు ధరించిన స్కేటర్స్ రెండు వేరువేరుగా ఉన్నాయి. అదే ఈ ఫొటోలో ఉన్న తప్పు. సాధారణంగా ఐస్ స్కేటింగ్ చేసే వారు ధరించే షూస్‌కు చక్రాలు ఉండవు. కానీ ఈ ఫొటోలో ఒక షూకి చక్రాలను గమనించవచ్చు.