Smart Phones: కేవలం రూ.25,000 లోపే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్స్.. ఫాస్ట్ ఛార్జింగ్, బెట్టర్ కెమెరా ఆప్షన్..
Smart Phones Under 25K: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్రయత్నం చేస్తున్నారా? మార్కెట్‌లో బెస్ట్ ఏదో తెలియక గందరగోళంగా ఉందా? టాప్ 5 కేవలం రూ.25 వేలలోపే అందుబాటులో ఉన్న ఈ ఫోన్స్ ఒకసారి చెక్ చేయండి..

Smart Phones: కేవలం రూ.25,000 లోపే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్స్.. ఫాస్ట్ ఛార్జింగ్, బెట్టర్ కెమెరా ఆప్షన్..
Smart Phones Under 25K: మార్కెట్‌లో ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కోటి ఒక్కో ఫీచర్ కలిగి ఉంటుంది. కొన్ని ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మరికొన్ని కెమెరా ఆప్షన్ బాగుంటుంది. అయితే, కేవలం రూ.25 వేల లోపే మీరు అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 5G:
వన్ ప్లస్ నార్డ్ 6.7 ఇంచులు కలిగి ఉన్న AMOLED డిస్‌ప్లే. ఇది హచ్‌డీఆర్ 10 ప్లస్ సపోర్ట్‌తోపాటు 120Hz రీఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లు రకరకాల కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 పై రన్ అవుతుంది. వన్ ప్లస్ నార్డ్‌లో 8GB RAM, అదనంగా 8GB వర్చువల్ RAM కలిగి ఉంది. 50 ఎంపీ ప్లస్ 8 ఎంపీ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్పీ కెమెరా 16MP హ్యాండిల్ చేస్తుంది. 5,500mAh బ్యాటరీ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. తద్వారా మీరు రోజంత ఉపయోగించవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ స్టోరేజ్ 128 జీబీ దీని ధర కేవలం రూ.21,696 మాత్రమే.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్..
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ స్పోర్ట్స్ 6.67 pOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కూడా స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ మోటరోలా ఫోన్‌లో 8GB RAM ఉంటుంది. 50 ఎంపీ ప్లస్ 13 ఎంపీ డ్యుయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ. 5,000mAh బ్యాటరీ సపోర్ట్‌తో 68 W ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. అంతేకాదు ఈ మోటరోలా ఫోన్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. దీని ధర విషయానికి వస్తే కేవలం రూ.19,999 మాత్రమే..
నథింగ్ ఫోన్ 3a..
నథింగ్ ఫోన్ 3a 6.77 AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 387 PPI రిసొల్యూషన్‌తోపాటు స్పాప్ డ్రాగన్ 7s జెన్ 3 చిప్ సెట్ కలిగి ఉంటుంది. 8GB RAM, 128 GB స్టోరేజీ కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 mp+ 50mp+8mp ట్రిపుల్ కెమెరా దీంతో షార్ప్ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఇక సెల్పీ 32 ఎంపీ ఫ్రంట్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ సపోర్ట్‌తోపాటు 50W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5 రివర్స్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది. ఇందులో హెడ్‌ఫోన్ జ్యాక్ ఉండదు కానీ, ఎన్‌ఎఫ్‌సీ కలిగి ఉంటుంది. దీని ధర కేవలం రూ.23,715 మాత్రమే..