Amazon Mobile Offers: అమెజాన్ సరికొత్త సేల్.. మోటో ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈనెల 26 వరకే ఛాన్స్..!

Amazon Mobile Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సరికొత్త సేల్ ప్రకటించింది. ప్రీమియర్ లీగ్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంది. మార్చి 26 వరకు ఈ సేల్ లైవ్ అవుతుంది.

Update: 2025-03-23 14:00 GMT
Amazon Mobile Offers

Amazon Mobile Offers: అమెజాన్ సరికొత్త సేల్.. మోటో ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈనెల 26 వరకే ఛాన్స్..!

  • whatsapp icon

Amazon Mobile Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సరికొత్త సేల్ ప్రకటించింది. ప్రీమియర్ లీగ్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంది. మార్చి 26 వరకు ఈ సేల్ లైవ్ అవుతుంది. ఈ హాట్ డీల్‌లో మీరు ఉత్తమ ఆఫర్‌లతో 'Motorola G45 5G'ని కొనుగోలు చేయచ్చు. 8 జీబీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.11,728గా ఉంది. స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో కూడా లభిస్తుంది.

కంపెనీ ఫోన్‌పై రూ.352 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్‌ను చౌకగా రూ.10,800కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్ , కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీ స్థితిపై ఆధారపడి ఉంటుంది. అలానే బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Motorola G45 5G Features

కంపెనీ ఈ ఫోన్‌లో 1600x720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 ఫోన్‌లో అందించారు. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌ని చూడవచ్చు. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో LED ఫ్లాష్‌తో రెండు కెమెరాలు ఉన్నాయి.

వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌ను పవర్ చేయడానికి ఇందులో 5000mAh బ్యాటరీని చూడచ్చు. ఈ బ్యాటరీ 18 వాట్ల ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఓఎస్ గురించి చెప్పాలంటే, ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా My UXలో పని చేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం, ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అంతే కాకుండా డాల్బీ అట్మోస్‌ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News