Voltas VS Daikin: వోల్టాస్ లేదా డైకిన్ ఏసీ రెండిటిలో ఏది చల్లని గాలి వీస్తుంది? ఎక్కువ రోజులు పనిచేస్తుంది?
Voltas VS Daikin : ఎండాకాలం ప్రారంభమైంది.. ఇక అందరూ కూలర్లు, ఏసీలపై ఆధారపడక తప్పదు. ఈ నేపథ్యంలో ఏసీలు కొనుగోలు చేసేవారి సంఖ్య ఈ కాలంలో ఎక్కువ అయింది.

Voltas VS Daikin : మండు వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఏసీలు, కూలర్లు కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇప్పటికే ఏసీలు ఉంటే వాటికి సర్వీసింగ్ చేసి ఉపయోగించాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం. అయితే కొత్తగా ఏసీలు కొనుగోలు చేయాలనుకుంటే వోల్టాస్ లేదా డైకిన్ రెండిట్లో ఏది తీసుకోవాలి? అనే గందరగోళంలో ఉన్నారా? మన దేశంలో ఎక్కువ శాతం మంది వోల్టాస్ లేదా డైకిన్ ఏసీలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. ఈ రెండు మంచి ఫీచర్స్ కలిగిన ఏసీలు.. అయితే రెండిటితో పోలిస్తే ఏది బెట్టర్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం
వోల్టాస్ ఏసీ..
వోల్టాస్ ఏసి ఇది ఇండియన్ ఉత్పత్తిదారు. ఈ ఎయిర్ కండిషనర్ చాలామందికి బెస్ట్ ఛాయిస్. ఇది మంచి కూలింగ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుంది. ఎంతటి ఎండ వేడిమిలో కూడా కూలింగ్ అందిస్తుంది. ఇందులో టర్బో కూలింగ్, ఫిల్టర్స్ కూడా ఉంటాయి.
సాధారణంగా ఈ ఏసీ ధర రూ.30 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఏ ఆన్లైన్ స్టోర్ నుంచి అయినా సులభంగా కొనుగోలు చేయవచ్చు. లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వివిధ ప్రధాన పట్టణాల్లో గుడ్ కస్టమర్ సర్వీస్ నెట్వర్క్ కూడా ఉంది. మీ ఏసీకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే త్వరగా పరిష్కారం అవుతుంది.
డైకిన్ ఏసీ..
డైకిన్ ఏసీ జపాన్ తయారీదారు. హై క్లాస్ క్వాలిటీ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ కలిగి ఉంటుంది. మంచి కూలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో ఇన్వర్టర్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. కరెంటు బిల్లు భారం కూడా తగ్గించేస్తాయి. అంతేకాదు ఎక్కువ శబ్దం లేకుండా చల్లదనాన్ని అందిస్తాయి. ఇక డైకిన్ 1.5 టన్ ఏసీ రూ. 45 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కువ రోజులపాటు పనిచేస్తాయి. తక్కువ కరెంటు బిల్లు ఖర్చు అవుతుంది. ఇవి రిటైల్‌తో పాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. డైకిన్ అధికారిక వెబ్‌సైట్లో కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టౌన్స్ లో కూడా రిపేరింగ్, సర్వీసింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది.
అయితే రెండిటితో పోలిస్తే వోల్టాస్ బెస్ట్ ఆప్షన్. ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉండటమే కాకుండా సర్వీసింగ్ కూడా చాలా సులభంగా అవుతుంది. అయితే ఒకవేళ మీరు డైకిన్ ఏసీ కొనుగోలు చేస్తే కరెంట్ బిల్లు ఖర్చు తగ్గుతుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ మెషిన్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ రెండిటిలో ఏది బెస్ట్ అంటే మీరు చేసే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది.