Tech News: మీ పనులను చకాచకా చేసే AI మెషీన్.. ఇది మీతో ఉంటే ఏ పనైనా ఇట్టే అయిపోతుంది!
Agentic AI: ముందు ఆలోచించి పని చేసే Agentic AI కార్యాలయాల్లో వేగంగా ప్రవేశిస్తోంది. మనం కూడా టెక్నాలజీతో పాటు మారకపోతే, పని పోతుంది.

Tech News: మీ పనులను చకాచకా చేసే AI మెషీన్.. ఇది మీతో ఉంటే ఏ పనైనా ఇట్టే అయిపోతుంది!
Agentic AI: ఒక రోజు మీరు ఇంట్లో కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతుంటారు. అదే సమయంలో ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందిజజ మీటింగ్ సమయం రిమైండ్ చేస్తూ, మాట్లాడాల్సిన విషయాల చిట్టా కూడా అటాచ్ చేసి ఉంటుంది. కొద్ది సేపట్లో మీ ఈమెయిల్లో ఓ రెడీ మెయిల్ డ్రాఫ్ట్ కనిపిస్తుంది. మీరు ఏమీ అడగకముందే, మీ పని ముందే పూర్తైపోయిందంటే? ఇది మీ టీమ్ మెంబర్ చేసిన పని కాదు... ఇది Agentic AI పని.
ఇది మామూలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. మనం ఇప్పటివరకు చూసిన AI కేవలం సమాధానాలు చెప్పే, సమాచారాన్ని అందించే టూల్స్. కానీ Agentic AI మనిషిలా ఆలోచిస్తుంది. పని చేసే పద్ధతిలో తెలివితేటలు కలిగి ఉంటుంది. దీన్ని ఒక ఫ్రెండ్‌లా అనుకోవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించేందుకు మీతో పాటు పనిచేసే సహచరుడిలా భావించవచ్చు. మీరు ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని సాధించేందుకు అవసరమైన స్టెప్స్ ఏమిటో తానే ప్లాన్ చేసుకుంటుంది. ఎవరితో మాట్లాడాలి, ఏ డేటా చూడాలి, ఏ పని ముందు చేయాలో అన్నీ తానే నిర్ణయించుకుంటుంది.
ఇది Predictive AI, Generative AI రెండింటినీ మిళితం చేసిన శక్తివంతమైన టెక్నాలజీ. Predictive అంటే ముందే అంచనా వేసే మెదడు, Generative అంటే కొత్త సమాచారాన్ని సృష్టించగల శక్తి. ఈ రెండింటినీ కలిపినపుడు తయారవుతుంది ఇప్పుడు కొన్ని కార్యాలయాల్లో ఈ టెక్నాలజీ నెమ్మదిగా ప్రవేశిస్తోంది. మీటింగ్‌లు షెడ్యూల్ చేయడం, ఇమెయిల్లు పంపడం, ప్రాజెక్ట్‌లను ట్రాక్ చేయడం లాంటి పనులు మనకన్నా వేగంగా, ఖచ్చితంగా చేస్తోంది. ఇది కేవలం ఆదేశాల కోసం ఎదురుచూడదు, ముందే ఆలోచించి, ముందే చర్యలు తీసుకుంటుంది.
ఇది ఎంతో ఉపయోగకరమైన టెక్నాలజీ అయినా, మన ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపే అవకాశమూ ఉంది. అందుకే టెక్నాలజీతో పాటు మనం కూడా ఎదగాలి. లేకపోతే, మన పని మనకన్నా ముందు ఎవరో మొదలెట్టేస్తారు.