AC Bill: ఏసీ బిల్‌ తక్కువగా రావాలంటే ఈ ట్రిక్‌ ట్రై చేయండి.. ఈసారి బిల్‌ చూసి మీరే కళ్లు తేలేస్తారు..!

AC Bill Lower Tricks: వేసవి కాలం మొదలైంది దీంతో ఏసీలు ఆన్‌ చేస్తారు. రాత్రి సమయంలో మాత్రమే కాదు, ఈ ఎండ వేడిమికి పగలు ఇంట్లో ఉన్నా ఆన్‌ చేయక తప్పడం లేదు.

Update: 2025-03-21 09:28 GMT
AC Bill Reduction Tips How to Lower Your Energy Bill This Summer

AC Bill: ఏసీ బిల్‌ తక్కువగా రావాలంటే ఈ ట్రిక్‌ ట్రై చేయండి.. ఈసారి బిల్‌ చూసి మీరే కళ్లు తేలేస్తారు..!

  • whatsapp icon

AC Bill Lower Tricks: ఎండ వేడిమి తట్టుకోలేక కూలర్లు, ఫ్యాన్స్‌, ఏసీలు నిరంతరం వాడుతూనే ఉన్నాం. అయితే, నెలవచ్చే సరికి కరెంట్‌ బిల్‌ చూసి కళ్లు తేలేస్తుంటారు. కానీ, కొన్ని కొన్ని చిన్న ట్రిక్స్‌ ప్రయత్నించి ఏసీ బిల్‌ తగ్గించుకోవచ్చు.

మండే ఎండాకాలం రాత్రి సమయం మాత్రమే కాదు ఒకవేళ పగలు ఇంట్లో ఉన్నా ఏసీ వేయక తప్పుడం లేదు. ఉక్కపోత కూడా మరీ ఎక్కువైంది. అయితే, టెంపరేచర్‌ సెట్‌ చేస్తూ కరెంట్‌ బిల్‌ను తగ్గించుకోవచ్చు. ఈ ఎండాకాలం ముగిసే వరకు ఏసీ వాడతాం కాబట్టి ఈ ట్రిక్స్‌ మీరు కూడా ప్రయత్నించండి. ఇక అసలైన ఎండ ఏప్రిల్‌, మే నెలలో ఉంటుంది. ఏసీ నిరంతరం రన్‌ చేస్తూనే ఉండాల్సి వస్తుంది.

అయితే, కరెంట్‌ బిల్‌ ఏమాత్రం ఎక్కువ రాకుండా కొన్ని ట్రిక్స్‌ పాటించండి. ముందుగా మీరు ఏసీ ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌ చేయించుకోండి. అది విండో ఏసీ అయినా స్ల్పిట్‌ ఏసీ అయినా. ముందుగా మీరు ఏసీ టెంపరేచర్‌ సెట్‌ చేయడం అలవాటు చేసుకోవాలి.

మీరు కొనుగోలు చేసిన ఏసీ రూమ్‌ టెంపరేచర్‌కు సరిపోతుందా చూడండి. అయితే, చాలామంది టెంపరేచర్‌ తగ్గిస్తే కరెంట్‌ బిల్‌ తక్కువ వస్తది అనుకుంటారు. కానీ, కరెంట్‌ బిల్‌ మోత మోగిపోతుంది. ఎంత చల్లని టెంపరేచర్‌ పెడితే అంత ఎలక్ట్రిసిటీ బిల్‌ ఎక్కువ వస్తుంది.

బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియేన్సీ (BEE) ప్రకారం ఏసీ ఎప్పుడూ 24 డిగ్రీల సెల్సీయెస్‌ ఉండేలా చూసుకోండి. ఈ డిగ్రీ వద్ద ఉంటే కరెంట్ బిల్‌ తగ్గుతుంది. ఇది చాలా వరకు ఏసీల్లో డీఫాల్ట్‌ సెట్టింగ్‌. అంతేకాదు ఈ టెంపరేచర్‌ మీ ఆరోగ్యానికి కూడా మంచిది.

మీరు ఏసీ టెంపరేచర్‌ తగ్గించినప్పుడల్లా ఎలక్ట్రీసిటీ బిల్‌ పెరుగుతుందని గుర్తుంచుకోండి. ఒక్క డిగ్రీ తగ్గిస్ఏ 10 నుంచి 12 శాతం విద్యుత్‌ బిల్‌ పెరుగుతుంది. అందుకే 24 డిగ్రీలకు ఫిక్స్‌ చేసేయండి.

ఇక ఏసీ బిల్‌ అధికంగా రావడానికి మరో ప్రధాన కారణం ఏసీ రేటింగ్‌. తక్కువ స్టార్‌ రేటింగ్‌ ఉంటే ఎక్కువ కరెంట్‌ బిల్‌ వస్తుంది. ఎక్కువ రేటింగ్‌ ఉన్న ఏసీలు తక్కువ కరెంటును వినియోగిస్తాయి. అందుకే ఎప్పుడూ 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఏసీని మాత్రమే కొనుగోలు చేయండి. 3 స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఏసీ ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తుంది.

Tags:    

Similar News