Realme P3 5G: 6000mAh బ్యాటరీతో రియల్‌మీ నయా ఫోన్.. సాయంత్రం 6 గంటలకే ఫస్ట్ సేల్..!
Realme P3 5G: రియల్‌మీ P3 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. తన 'P' సిరీస్‌లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

Realme P3 5G: 6000mAh బ్యాటరీతో రియల్‌మీ నయా ఫోన్.. సాయంత్రం 6 గంటలకే ఫస్ట్ సేల్..!
Realme P3 5G: రియల్‌మీ P3 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. తన 'P' సిరీస్‌లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. కంపెనీ ఈరోజు రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. వీటిలో Realme P3 5G మొబైల్ ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ, మెరుగైన కెమెరా సెటప్‌తో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.15,000గా నిర్ణయించింది. బడ్జెట్‌లోనే అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.16,999. మార్చి 26 మధ్యాహ్నం 12 గంటల నుండి కంపెనీ అధికారిక వెబ్‌సైట్ , రియల్‌మీ స్టోర్ యాప్, ఫ్లిప్‌కార్ట్ నుండి ఫోన్ సేల్‌కి వస్తుంది. ఫస్ట్ సేల్ మార్చి 19న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగనుంది. రియల్‌మీ పాత కస్టమర్‌లకు అదనంగా రూ. 500 డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ మొబైల్ స్పేస్ సిల్వర్, కామెట్ గ్రే, నెబ్యులా పింక్ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Realme P3 5G Features
మొబైల్‌లో 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 2400 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌కుసపోర్ట్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1500Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ గ్రాఫిక్స్ కోసం ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0తో పనిచేస్తుంది, ఇందులో Adreno 810 GPU ఉంటుంది. ఈ ఫోన్‌లో 6GB RAM + 8GB RAM ఉంది. 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అదనంగా, రెండవ కెమెరాలో 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. స్మార్ట్‌ఫోన్ 6000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. USB టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB టైప్-C ఉన్నాయి.