GTA 6: జీటీఏ 6 విడుదల తేదీ వచ్చేసింది.. దీని ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!
GTA6 Launching Date Out: రాక్‌స్టార్ గేమ్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో (GTA) 6 కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నవారు ఉన్నారు. అయితే, ఈ గేమ్ విడుదలపై ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ఈ పూర్తి వివరాలు తెలుకుసుకుందాం.

GTA 6: జీటీఏ 6 విడుదల తేదీ వచ్చేసింది.. దీని ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!
GTA6 Launching Date Out: రాక్‌స్టార్ పేరెంటింగ్ కంపెనీ 'టేక్ టూ ఇంటరాక్టీవ్' జీటీఏ6 గేమ్ విడుదల తేదీ, ధర, ప్రీ ఆర్డర్‌లకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. అయితే, ఈ గేమ్ ఈ ఏడాది విడుదల కానుంది. ఇప్పటికే మలేషియాలో ప్రీ ఆర్డర్ బుకింగ్స్ కూడా తీసుకుంటున్నారు. అతి త్వరలోనే ఈ గేమ్ విడుదల తేదీ గురించి ప్రకటన రానుంది.
జీటీఏ 6 గేమ్ 2025 సెప్టెంబర్ లేదా నవంబర్ నెలల్లో విడుదల చేయనుంది. అయితే, బార్డర్‌ల్యాండ్స్4 కూడా 2025 సెప్టెంబర్ 23వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జీటీఏ6 గేమ్ మార్కెట్ పోటీ దృష్ట్యా అక్టోబర్ లేదా నవంబర్ విడుదల చేయనుందని తెలుస్తోంది.
రాక్‌స్టార్ గేమ్స్ మాత్రం జీటీఏ 6 ప్రీ ఆర్డర్స్ గురించి అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే, మలేషియన్ రిటైలర్ గేమర్స్ హైడ్‌అవుట్ ప్రీ ఆర్డర్ బుకింగ్ స్వీకరిస్తుంది. దీని ధర ఇండియన్ రూపీలో రూ.290. అయితే, గేమ్ ప్రారంభం అయ్యే ముందు జీటీఏ 6 అసలు ధరను ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జీటీఏ 6 గేమ్ ధరను కూడా రాక్‌స్టార్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఇండస్ట్రీ ప్రకారం జీటీఏ6 గేమ్ ధర 100 డాలర్లు పైనే ఉంటుందని అంచనా వేసింది. ఇది AAA గేమింగ్ ధరకు మింది ఉంది. అయితే, గేమింగ్ ఎక్స్‌పర్ట్ మాథ్యూ బాల్ ప్రకారం ఈ పెరిగిన ధర జీటీఏ6 ఆట అభివృద్ధి స్కేల్ ప్రధాన కారణమంటున్నారు.
మన దేశంలో జీటీఏ 6 గేమింగ్ ధర రూ.5999 బేసిక్ ఎడిషన్ ఉండగా, ప్రీమియం ఎడిషన్ ధర రూ.7,299 అంతకు మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా జీటీఏ6 ఫస్ట్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. లియోనిడా అనే ఫిక్షనల్ స్టేట్ నేపథ్యంతో రూపొందించారు. జాసన్, లూసియా అనే రెండు పాత్రలు ఉండగా, అచ్చం ఫ్లోరిడాను పోలిన వాతావరణం కనిపిస్తోంది. అయితే, రెండో ట్రైలర్ మాత్రం ఏప్రిల్ 1వ తేదీ విడుదల అవ్వచ్చని చెబుతున్నారు.