Mars: అంగారక గ్రహంపై జీవం..? నాసా సంచలనం రిపోర్ట్!
Mars: అంగారక గ్రహం లోపల నీటి సముద్రం లాంటి ఒక భారీ ఉపరితలాన్ని నాసా సైంటిస్టులు గుర్తించారు.

Mars: అంగారక గ్రహంపై జీవం..? నాసా సంచలనం రిపోర్ట్!
Mars: మార్స్..! ఈ ఎర్రని గ్రహం చుట్టూ ఎన్నో అంతులేని ప్రశ్నలు..! అక్కడ జీవం ఉందా? అక్కడ మనిషి అడుగు పెట్టగలడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం సైంటిస్టులు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. సూర్యమండలంలోని నాలుగో గ్రహం ఇది. భూమికి అతి సమీపంలో ఉండే గ్రహం కూడా ఇదే. పురాతన చరిత్ర చూస్తే చాలా మంది శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని భావించారు. కానీ ఆధునిక శాస్త్రం మరింత లోతుగా పరిశీలించింది. కొన్ని దశాబ్దాల క్రితం టెలిస్కోప్ల ద్వారా అంగారక గ్రహంపై కాలువలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాతి మిషన్లు, ఉపగ్రహాలు, రోవర్‌ల పరిశీలనలు మళ్లీ నీటి ఉనికిని నిర్ధారించాయి. ఇటీవల నాసా అంగారక గ్రహంపై మరిన్ని విషయాలను బయటకు చెప్పింది. నాసా పంపిన ఇన్‌సైట్ ల్యాండర్ ద్వారా అంగారక గ్రహం అంతరంగాన్ని అధ్యయనం చేశారు. ఇది 2018లో ల్యాంచ్ అయింది. అక్కడి భూకంపాలను, లోపలున్న పదార్థాల స్వభావాన్ని విశ్లేషించేలా ఈ మిషన్‌ను రూపొందించారు. ఈ ల్యాండర్ ద్వారా వచ్చిన సెస్మిక్ డేటాను అధ్యయనం చేశారు సైంటిస్టులు. అంగారక గ్రహం లోపల నీటి సముద్రం లాంటి ఒక భారీ ఉపరితలాన్ని గుర్తించారు.
జపాన్‌కు చెందిన పరిశోధకులు ఈ డేటాను మరింత విశ్లేషించారు. 11.5కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల లోతులో భారీ స్థాయిలో నీరు దాగి ఉండొచ్చని జపాన్ పరిశోధకలు అంటున్నారు. నిజానికి నీరే జీవానికి ఆధారం. భూమిపై నీరు ఉన్న ప్రతి ప్రదేశంలో జీవం ఉంటుంది. అందుకే అంగారక గ్రహంపై కూడా జీవం ఉండొచ్చా అనే ప్రశ్న సైంటిస్టులను వేధిస్తోంది. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. అంగారక గ్రహంలో ఒకప్పుడు సముద్రాలు ఉండేవని స్పష్టం చేస్తున్నారు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై నదులు, సరస్సులు ఉన్నాయని నాసా రోవర్‌లు ఇప్పటికే గుర్తించాయి.
మరోవైపు అంగారక గ్రహంపై పరిశోధనలు చేయాలనే ఆలోచన ఇప్పటికే అనేక దేశాలకు ఉంది. 1960ల నుంచి రష్యా, అమెరికా, చైనా, భారత్ లాంటి దేశాలు మార్స్‌పై అనేక పరిశోధనలు చేశాయి. నాసా పంపిన పర్సీవీరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై మీద మట్టిని, రసాయనాలను పరిశీలించింది. అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. స్పేస్‌ఎక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలు కూడా మార్స్‌పై సమీప భవిష్యత్తులో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిజానికి మార్స్‌పై వాతావరణం భూమి కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ తక్కువ.. ఉష్ణోగ్రతలు చాలా తక్కువ. అంటే సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఇటు మనుషులకు హానికరమైన రేడియేషన్ ఉంటుంది. అయినా కూడా భూమికి ప్రత్యామ్నాయంగా మరో గ్రహం ఉండాలని మనిషి కోరుకుంటున్నాడు. అందుకే మార్స్‌పై ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. నాసా కొత్తగా చెప్పిన డేటా ప్రకారం మార్స్‌లో ఒకప్పుడు సముద్రాలు ఉండేవని మాత్రం అర్థమవుతుంది. అటు మార్స్ లోతుల్లో భారీ స్థాయిలో నీరు నిల్వ ఉందని జపాన్ పరిశోధకులు కూడా నిర్ధారించడం ఆసక్తిని రేపుతోంది.