BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ప్లాన్..365 రోజులపాటు మీ సిమ్ యాక్టీవ్, మరిన్ని లాభాలు..!
BSNL Introduces New Plan: ప్రభుత్వ దిగ్గజ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ నయా ప్లాన్ పరిచయం చేసింది. దీంతో ఒక్కసారి రీఛార్జీ చేసుకుంటే ఏడాది మొత్తం మీ సిమ్ యాక్టీవ్‌గా ఉంటుంది.

BSNL Introduces New Plan: బీఎస్‌ఎన్‌ఎల్ మరో బంపర్ ప్లాన్ అందుబాటులోకి తీసుకవచ్చింది. అతి తక్కువ ధరతో సిమ్ రీఛార్జీ చేసుకుందాం అనుకునేవారికి ఇది బంపర్ ఆఫర్. ఎందుకంటే ఒక్కసారి మీరు రూ.1198తో రీఛార్జీ చేసుకుంటే ఏడాది మొత్తం మీ సిమ్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇది ఎక్కువగా డేటా వాడనివారికి, సీనియర్ సిటిజెన్లకు పర్పెక్ట్ ప్లాన్. తక్కువ ధరతో ఎక్కువకాలం వ్యాలిడిటీ కూడా పొందుతారు.
ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌తో ప్లాన్‌తో మీరు ఒక్కసారి రీఛార్జీ చేసుకుంటే ఎన్ని లాభాలు పొందుతారు తెలుసుకుందాం..
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్, 365 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతోపాటు నెలకు 300 నిమిషాలు వాయిస్ కాల్స్ దేశంలో ఏ నెట్‌వర్క్ అయినా కాల్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. అంటే ఏడాదికి 3,600 కాలింగ్ నిమిషాలు పొందుతారు. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే మీకు ప్రతినెలా 3 జీబీ డేటా కూడా పొందుతారు. అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా మొత్తంగా 36 జీబీ పొందుతారు.
ప్రతినెలా అదనంగా 30 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ డేటా అతిగా వినియోగించని సీనియర్ సిటిజెన్లకు పర్పెక్ట్, సెకండ్ సిమ్, సీనియర్ సిటిజెన్స్, ఎన్‌ఆర్‌ఐలకు బెస్ట్.
ఇది కాకుండా రూ.1,499 తో రీఛార్జీ చేసుకుంటే 24 జీబీ డేటా ఏడాదిపాటు పొందుతారు. రూ.1999 తో మరో బీఎస్ఎన్‌ఎల్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 600 జీబీ డేటా ఏడాది వరకు పొందుతారు. బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న రూ.2,399 ప్లాన్‌తో ప్రతి రోజూ 2 జీబీ డేటాతో పాటు 425 రోజులు వ్యాలిడిటీ పొందుతారు.
బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న ఈ ప్లాన్ రూ.1,198 ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. సిమ్ యాక్టీవ్‌గా ఉంటే చాలు అనుకునేవారికి మంచి ఎంపిక. అతిగా ఖర్చు పెట్టకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే ప్లాన్.
బీఎస్‌ఎన్ఎల్ రూ.1,198 ప్లాన్ రీఛార్జీ చేసుకునే విధానం..
బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ పోర్టల్ కనిపిస్తుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రూ.1,198 ప్లాన్ సెలక్ట్ చేసుకోండి. ఫోన్ పే, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా పే చేసేయండి.