Neeraj Chopra: స్వర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ కూడా నా బిడ్డే...నీరజ్ చోప్రా తల్లి

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత ముద్దుబిడ్డ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ ను సాధించారు. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల జావెలిన్ త్రో కేటగిరీలో రజతాన్ని ముద్దాడారు. ఈ విభాగంలో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలవగా..వెండి పతకాన్ని అందుకున్నాడు. బంగారం పతకానికి చేరువైనా అది సాధ్యం కాలేదు. పాకిస్తాన్ అథ్లెట్ స్వర్ణం గెలుచుకోవడంపై నీరజ్ చోప్రా తల్లి స్పందించారు. ఆమె ఏమన్నారో తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Update: 2024-08-09 05:00 GMT

Neeraj Chopra: స్వర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ కూడా నా బిడ్డే...నీరజ్ చోప్రా తల్లి

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్ లో పాక్ అథ్లెట్ హర్షద్ నదీమ్ గోల్డ్ సాధించాడు. అర్హద్ ఈటెను 92.97 మీటర్లు విసిరి ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేశాడు. భారత స్టార్ జావెలిన్ త్రో ప్రేయర్ నీరజ్ చోప్రా ఈటెను 89. 45 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ సాధించి భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేర్చాడు. నీరజ్ సిల్వర్ మెడల్ సాధించడంతో హర్యానాలోని తన ఇంటి దగ్గర సందడి నెలకొంది. నీరజ్ కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుంటూ పండగ చేసుకున్నారు. నీరజ్ తల్లి సరోజ్ దేవి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు అందరి మనసులు గెలుచుకున్నాడు అన్నారు.

బంగారు పతకం సాధించిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా తన కుమారుడు లాంటోడే అని నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవీ అన్నారు. నా కుమారుడు నీరజ్ చోప్రా రజత పతకం సాధించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. బంగారు పతకం కంటే కూడా ఎంతో విలువైంది అన్నారు. బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్ కూడా నా బిడ్డ లాటివాడే అంటూ నీరజ్ తల్లి వ్యాఖ్యానించారు. నీరజ్ ప్రదర్శన ఎంతో గర్వంగా ఉ:ది..ఇంటికి వచ్చిన తర్వాత నీరజ్ కు ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా అంటూ సరోజ్ దేవి చెప్పారు.

నీరజ్ చోప్రా తండ్రి మాట్లాడుతూ..నీరజ్ దేశం కోసం సిల్వర్ మెడల్ ను సాధించాడు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాము. నీరజ్ యువతకు స్పూర్తిగా నిలవడం సంతోషంగా ఉంది. గాయం తీవ్రత కూడా అతని ప్రదర్శనపై కాస్త ప్రభావం చూపి ఉండవచ్చు అన్నారు. గాయం లేకపోతే మెరుగైన ప్రదర్శన చేసేవాడని చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్ కు ముందు గాయం కారణంగా నీరజ్ దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత తీవ్రంగా శ్రమించి ఒలింపిక్స్ బరిలోకి దిగాడు.


Tags:    

Similar News