AUS vs IND: ఆ ఇద్దరికే కెప్టెన్ బుమ్రా ఓటు.. ఆసీస్‌తో తొలి టెస్టులో ఆడే భారత తుది జట్టు ఇదే..!

AUS vs IND: మరో రెండు రోజుల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభం కానుంది.

Update: 2024-11-20 12:19 GMT

AUS vs IND: ఆ ఇద్దరికే కెప్టెన్ బుమ్రా ఓటు.. ఆసీస్‌తో తొలి టెస్టులో ఆడే భారత తుది జట్టు ఇదే..!

AUS vs IND: మరో రెండు రోజుల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభం కానుంది. ఐదు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరాలంటే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మొదటి టెస్టులోనే గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని చూస్తున్నాయి. శుక్రవారం ఆరంభం కానున్న పెర్త్ టెస్ట్ కోసం కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తన తుది జట్టుపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసినట్లు తెలుస్తోంది.

కెప్టెన్ రోహిత్ శర్మకు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. పుత్రోత్సాహంలో ఉన్న రోహిత్.. మొదటి టెస్టుకు తాను అందుబాటులో ఉండనని బీసీసీఐకి తెలిపాడు. హిట్‌మ్యాన్ గైర్హాజరీలో సారథిగా జస్ప్రీత్ బుమ్రా భారత జట్టును నడిపించనున్నాడు. రోహిత్ లేకపోవడంతో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్‌ రాహుల్ ఓపెనర్‌గా రానున్నాడు. దాంతో అభిమన్యు ఈశ్వరన్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. శుభ్‌మ‌న్ గిల్ గాయం కారణంగా.. వన్‌ డౌన్‌లో సర్ఫరాజ్‌ ఖాన్ ఆడే అవకాశం ఉంది. కింగ్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, కీపర్ రిషబ్ పంత్ ఐదవ స్థానంలో వస్తారు. ధ్రువ్‌ జురెల్‌ ఆరో స్థానంలో బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా-ఏపై జురెల్‌ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.

తెలుగు ఆటగాడు నితీశ్‌ కుమార్ రెడ్డి అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి రానున్నాడు. ఆస్ట్రేలియా-ఏ, ఇంట్రాస్క్వాడ్‌ వార్మప్‌ మ్యాచ్‌లో నితీశ్ అద్భుత ప్రదర్శన చేశాడు. విదేశాల్లో స్పిన్నర్‌ అంటే అందరికీ బ్యాటింగ్‌ సామర్థ్యం ఉన్న రవీంద్ర జడేజానే గుర్తుకొస్తాడు. అయితే ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోవావడానికే బుమ్రా మొగ్గుచూపిస్తున్నాడట. బౌన్సీ పిచ్‌లపై యాష్ మరింత ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తాడని బుమ్రా భావిస్తున్నాడట. పేస్ విభాగంలో తనతో పాటు మహ్మద్ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌లను ఎంచుకున్నాడట.

తుది జట్టు (అంచనా):

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్‌.

Tags:    

Similar News