IND vs AUS: ఇదెక్కడి ట్విస్ట్.. పెర్త్ టెస్టుకు ముందు టీమిండియాలోకి యువ బ్యాటర్..!

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Update: 2024-11-21 12:19 GMT

IND vs AUS: ఇదెక్కడి ట్విస్ట్.. పెర్త్ టెస్టుకు ముందు టీమిండియాలోకి యువ బ్యాటర్..!

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం 7.50కి మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఇరు జట్లు విజయం కోసం బరిలోకి దిగనున్నాయి. అయితే పెర్త్ టెస్టు ఆరంభానికి ముందు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. తొలి టెస్టు కోసం యువ బ్యాటర్ దేవ్‌దత్‌ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. పడిక్కల్ జట్టుతో కలిసిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

గాయపడిన శుభ్‌మన్‌ గిల్ స్థానంలో దేవ్‌దత్‌ పడిక్కల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇంట్రా స్క్వాడ్ వార్మప్‌ మ్యాచ్‌లో గిల్‌ బొటన వేలికి గాయమైంది. స్కానింగ్‌లో చీలికలు వచ్చినట్లు తెలిసింది. పెర్త్ టెస్టుకు అతడు దూరం కానున్నదని సమాచారం. అందుకే ఉన్నపళంగా పడిక్కల్‌ను జట్టులోకి చేర్చింది. ఇటీవల ఆస్ట్రేలియా-ఏతో జరిగిన తొలి అనధికార టెస్టులో పడిక్కల్ రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 36, 88 పరుగులు చేశాడు. పెర్త్ టెస్టులో పడిక్కల్‌ మూడో స్థానంలో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏడాది ఆరంభంలో ఇంగ్లడ్‌తో ధర్మశాలలో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన పడిక్కల్‌ 65 పరుగులు చేశాడు. ఇటీవలి కాలంలో దేశవాళీ టోర్నీలలో అతడు బాగా ఆడాడు.

పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేడు. దాంతో భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. నిన్నటి వరకు గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఆడుతాడని అందరూ అనుకున్నారు. ఉన్నపళంగా జట్టులోకి పడిక్కల్‌ రావడంతో మూడో స్థానంలో ఎవరు ఆడుతారు అనే సందిగ్దత మొదలైంది. ఆస్ట్రేలియా-ఏపై ధృవ్ జురెల్ కూడా రాణించడంతో సర్ఫరాజ్‌కు నిరాశ తప్పేలా లేదు. చూడాలి మరి కెప్టెన్ బుమ్రా ఎవరికి ఓటేస్తాడో.

భారత జట్టు:

జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, రోహిత్ శర్మ.

Tags:    

Similar News