Champions Trophy 2024: ఫైనల్‌లో చైనా చిత్తు.. ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్!

Update: 2024-11-20 16:15 GMT

India beats China in Womens Asian Champions Trophy 2024: మహిళల ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ 2024లో భారత జట్టు అదరగొట్టింది. టోర్నీలో ఓటమే ఎరుగని భారత మహిళా జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం బీహార్‌లోని రాజ్‌గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో చైనాను 1-0తో చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. దాంతో ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ టైటిల్‌ను భారత్ మూడోసారి గెలుచుకుంది. టోర్నీ చరిత్రలో భారత్, దక్షిణ కొరియా మాత్రమే మూడు టైటిల్స్‌ను సాధించాయి.

ఫైనల్‌లో చైనా, భారత్ అమ్మాయిలు హోరాహోరీగా తలపడ్డారు. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా చేయలేదు. భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. పెనాల్టీ స్ట్రోక్‌ను దీపిక గోల్‌ వేయలేకపోయింది. అయితే మూడో క్వార్టర్‌ ఆరంభంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను.. దీపిక గోల్‌గా కొట్టింది. రెండో అర్ధ భాగంలో స్కోరును సమం చేయడానికి చైనా బాగానే ప్రయత్నించింది. చైనా గోల్స్‌ను భారత్ అడ్డుకుంది. దాంతో భారత్ విజేతగా నిలిచింది.

లీగ్‌ దశలో భారత మహిళా జట్టు వరుస విజయాలు సాధించింది. సలీమా నేతృత్వంలోని భారత్ బృందం లీగ్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌లు గెలిచింది. దీపిక, సంగీత కుమారి, షర్మిలా దేవి, ప్రీతి దూబెలు రాణించారు. లీగ్ దశలో కనబర్చిన దూకుడునే సెమీ ఫైనల్‌లో జపాన్‌పై ప్రదర్శించింది. నవీనీత్‌ కౌర్‌, లాల్‌రెమ్సియామి గోల్స్ కొట్టి అద్భుత విజయంను అందించారు. ఈ ఏడాది పురుషుల హాకీ జట్టు పెద్దగా ప్రభావం చూపని విషయం తెలిసిందే.

Tags:    

Similar News