India Vs Sri Lanka: టీమిండియా 62 పరుగుల తేడాతో ఘన విజయం

India Vs Sri Lanka: అత్యధిక వ్యక్తిగత స్కోరుతో కీలక పాత్రపోషించిన ఇషాన్ కిషన్

Update: 2022-02-25 02:11 GMT

 టీమిండియా 62 పరుగుల తేడాతో ఘన విజయం

India Vs Sri Lanka: టీమిండియా అద్భుతమైన ఆటతీరుతో శ్రీలంకపై విజయం సాధించింది. మూడు మ్యాచులో సిరీస్ లో తొలిమ్యాచులో 62 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన శ్రీలంక మ్యాచ్ పై ఏదశలోనూ పట్టుసాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ కి దిగిన టీమిండియా బౌండరీల మోత సిక్సర్లతో జోరుపెంచి 199 పరుగులు చేసింది. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 137 పరుగులే చేయగలిగింది. దీంతో రోహిత్ సేన తొలిమ్యాచులో పైచేయి సాధించగలిగింది.

ఇషాన్ కిషన్ 56 బంతులు ఎదుర్కొని 10 బౌండరీలు , మూడు సిక్సర్లతో 89 పరుగులు అందించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 28 బంతుల్లో ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లతో 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 44 పరుగులు అందించాడు. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. ఇన్నింగ్స్ ప్రారంభంలో తొలిబంతికే ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ న భువనేశ్వర్ కుమార్ బోల్తా కొట్టించాడు.

శ్రీలంక బ్యాట్స్ మెన్లలో అస్లంక 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లను పడగొట్టారు. ఛాహల్, జడేజా ఒక్కో విక్కెట్ చేజిక్కించుకోగలిగారు. ఓవరాల్ గా టీమిండియా అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక పరుగులతో జట్టువిజయంలో కీలక పాత్రపోషించిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Full View


Tags:    

Similar News