Sunrisers Hyderabad: ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఔట్.. ఇంగ్లాండ్ హిట్టర్‌కి ఛాన్స్
Sunrisers Hyderabad: మరో 8 రోజుల్లో ఐపీఎల్ 2021 సందడి మొదలు కానుంది.
Sunrisers Hyderabad: మరో 8 రోజుల్లో ఐపీఎల్ 2021 సందడి మొదలు కానుంది. అయితే, ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం కు గట్టి దెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ఎస్‌ఆర్ఎచ్ టీం ఇంగ్లాండ్ హిట్టర్ జేసన్ రాయ్ ని తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
సన్ రైజర్స్ టీం తన మొదటి మ్యాచ్ లో ఏప్రిల్ 11న కోల్‌కతా నైట్‌రైడర్స్ తో తలపడనుంది. అయితే, ఈ సీజన్ లో మినీ వేలానికి రూ.2 కోట్ల కనీస ధరతో వచ్చిన జేసన్ రాయ్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. కాగా, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగానే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం కనీస ధర రూ.2 కోట్లకు అతడ్ని తీసుకుంది.
ఐపీఎల్ 2017 సీజన్‌తో టోర్నీలోకి అరంగేట్రం చేశాడు ఈ హార్డ్ హిట్టర్ జేసన్ రాయ్. ఇంతకు ముందు గుజరాత్ లయన్స్ (టోర్నీలో లేదు), ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం జేసన్ రాయ్‌కి మిచెల్ మార్ష్ రూపంలో కలిసి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. తన ప్రతిభను చాటేందుకు ఇదో చక్కని వేదిక అని అభిఫ్రాయడుతున్నారు.