India vs Srilanka: ఆసియా కప్‌లో టీమిండియా ఆశలు గల్లంతు
India vs Srilanka: భారత్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక
India vs Srilanka: ఆసియా కప్‌లో టీమిండియా ఆశలు గల్లంతయ్యాయి. సూపర్-4 లో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు చెతులేత్తేశారు. ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. ఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. కెప్టెన్ రోహిత్ మినహా తక్కినవాళ్లంతా బ్యాట్‌తో విఫలం కాగా.. బౌలర్లు అద్భుతాలు చేయలేకపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో లంక 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్లు నిసాంక, కుషాల్ మెండిస్ అర్ధశతకాలతో ఆకట్టుకుంటే.. చివర్లో కెప్టెన్ దసున్ షనక 18 బంతుల్లో 33 పరుగులు, భానుక రాజపక్స 25 పరుగులు చేసి ఒత్తిడికి ఎదురు నిలిచి జట్టును గెలిపించారు. ఇక నామమాత్ర పోరులో గురువారం అఫ్గాన్‌తో రోహిత్ సేన తలపడనుంది.