SRH: ఒక్కసారే 8మంది క్రికెటర్లు అవుట్.. షాక్ లో సన్ రైజర్స్ జట్టు

SRH: ఐపీఎల్ 2025 లో మైదానంలోకి దిగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లుక్ ఎలా ఉండబోతుందని చాలా మంది ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

Update: 2025-03-18 13:30 GMT
SRH: ఒక్కసారే 8మంది క్రికెటర్లు అవుట్.. షాక్ లో సన్ రైజర్స్ జట్టు
  • whatsapp icon

SRH: ఐపీఎల్ 2025 లో మైదానంలోకి దిగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లుక్ ఎలా ఉండబోతుందని చాలా మంది ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇంతకు ఆ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుంది.. 12వ ప్లేయర్ ఎవరు అవుతారు. కావ్య మారన్ మెగా వేలంలో మిగిలిన ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పుడు జట్టు బలంగా కనిపించింది. కావ్య మారన్ మొత్తం 20 మంది ఆటగాళ్లను సెలక్ట్ చేసుకుంది. కానీ, ఆ 20 మంది ఆటగాళ్లలో కేవలం 12 మంది మాత్రమే గ్రౌండ్ లోని ప్రవేశించి మ్యాచ్‌ ఆడుతారు. అంటే మిగిలిన 8మంది మ్యాచ్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. మరి ఆ ఎనిమిది మంది ఎవరో చూద్దాం.

మునుపటి లాగే ఓపెనింగ్ బాధ్యత అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ భుజాలపై ఉంటుంది. అతనితో పాటు ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ కూడా ఉంటారు. ఈ ఇద్దరిలో ఒకరు వికెట్ కీపర్ పాత్రను పోషిస్తారు. అభినవ్ మనోహర్ మిడిల్ ఆర్డర్‌లో దిగొచ్చు. నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ పాత్రలో ఉండడం ఖాయం అని భావిస్తున్నారు. బౌలింగ్‌లో రాహుల్ చాహర్, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలను నిర్వర్తిస్తారు. మహమ్మద్ షమీ, కెప్టెన్ పాట్ కమ్మిన్స్, హర్షల్ పటేల్ జట్టు ఫాస్ట్ బౌలింగ్‌ చేస్తారు. ఈ ప్లేయింగ్ ఎలెవెన్ కాకుండా, ఒక ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్లేయింగ్ XI ఎవరు?

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కట్

ఇంపాక్ట్ ప్లేయర్- అనికేత్ వర్మ (బ్యాటింగ్)

ఈ 8 మంది ఆటగాళ్ళు అవుట్

ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుండి మ్యాచ్‌కు దూరంగా ఉండే 8 మంది ఆటగాళ్లలో హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్, ఇషాన్ మలింగ, బ్రైడాన్ కార్సే, కమిండు మెండిస్, జీషాన్ అన్సారీ, అథర్వ తైడే, సచిన్ బేబీ ఉన్నారు.

Tags:    

Similar News