IPL 2022 - RCB: బెంగుళూరు జట్టు కెప్టెన్సీ రేసులో రాహుల్, శ్రేయాస్
* తాజాగా బెంగుళూరు జట్టు హెడ్ కోచ్ గా నియమితుడైన సంజయ్ బంగర్
Royal Challengers Bangalore: టీ20 ప్రపంచకప్ 2021లో సెమీస్ వరకు కూడా చేరని భారత్ పేలవ ప్రదర్శనతో ఇంటి ముఖం పట్టింది. ఐపీఎల్ పూర్తైన తరువాత రెండు రోజుల్లోనే ప్రపంచకప్ లో పాల్గొన్న టీమిండియా.. అటు పాకిస్తాన్ తో పాటు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా విఫలమై గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించింది. తాజాగా ప్రపంచకప్ పూర్తవగానే రానున్న న్యూజిలాండ్ టూర్ తో పాటు ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు మరోసారి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే గడిచిన ప్రపంచకప్ విషయాన్నీ కాసేపు పక్కనపెడితే త్వరలో ఐపీఎల్ 2022 లో ఆటగాళ్ళ కోసం జరగబోయే మెగా వేలంలో జట్టు యాజమాన్యం మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు కొన్ని ఐపీఎల్ జట్టు యాజమాన్యాలు నలుగురు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్న మరికొంత మంది స్టార్ ఆటగాళ్ళు మాత్రం వేలంలో పాల్గోనబోతున్నట్లు సమాచారం. అదే కోవలో తాజాగా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరిలో ఒకరు బెంగుళూరు జట్టులో కెప్టెన్ గా అయ్యే అవకాశాలు ఉన్నట్లు క్రీడా వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
విరాట్ కోహ్లి ఇటు టీ20లలో టీమిండియాతో పాటు ఐపీఎల్ లో బెంగుళూరు జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవడంతో ఇపుడు బెంగుళూరు జట్టుకు ఎవరు కొత్త కెప్టెన్ గా ఎంపిక అవుతారోనని సర్వత్రా ఉత్కంట నెలకొంది. మరి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కొంతకాలం కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్, ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ లో ఎవరు బెంగుళూరు జట్టుకి కెప్టెన్ అవుతారో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే. తాజాగా ఐపీఎల్ 2022 కి గాను బెంగుళూరు జట్టు హెడ్ కోచ్ గా సంజయ్ బంగర్ నియమించబడ్డాడు.