Road Safety World Series: సచిన్ మెరుపులు..యువీ సిక్సర్‌ షో.. ఫైనల్లో లెజెండ్స్

Road Safety World Series: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భారత లెజెండ్స్‌ ఆదరగొడుతున్నారు.

Update: 2021-03-18 03:24 GMT

Road Safety World Series T20

Road Safety World Series: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భారత లెజెండ్స్‌ ఆదరగొడుతున్నారు. రాయ్ పూర్ వేదికగా వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్లో సచిన్ సేన ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లెజెండ్స్‌.. కెప్టెన్‌ సచిన్‌ (65; 42 బంతుల్లో 6×4, 3×6), యువరాజ్‌ సింగ్‌ (49 నాటౌట్‌; 20 బంతుల్లో 1×4, 6×6)చేలరేగారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. వెస్టిండీస్ లెజెండ్స్ బౌలర్లలో టినో బెస్ట్ రెండు వికెట్లు తీయగా.. ర్యాన్ ఆస్టిన్ ఓ వికెట్ పడగొట్టాడు

అనంతరం లక్ష్యచేధనలో వెస్టిండీస్ లెజెండ్స్‌ గట్టిపోటీనిచ్చింది. ఓ దశలో విజయానికి చేరువుగా వచ్చింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 6 వికెట్లకు 206 పరుగులే చేయగలిగింది. డ్వేన్‌ స్మిత్‌ (63; 36 బంతుల్లో 9×4, 2×6)పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్‌ బ్రయాన్‌ లారా (46; 28 బంతుల్లో 4×4, 2×6) రాణించారు. భారత బౌలర్లలో వినయ్‌ కుమార్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

అంతకుము ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లెజెండ్స్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) మెరుపు సచిన్ తో కలిసి ఆశుభారంభాన్ని అందించారు. బౌండరీలే లక్ష్యంగా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిని సెహ్వాగ్ స్కోర్ బోర్డ్‌ను పరుగెత్తించాడు. అదే జోరులో అతను రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగడంతో మొదటి వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ కైఫ్‌(27)తో సచిన్ ధాటిగా ఆడాడు. కైఫ్ ఔటైనా.. యూసఫ్ పఠాన్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) చెలరేగాడు. ఈ క్రమంలో సచిన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆఖర్లో బ్యాటింగ్‌కు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌(49 నాటౌట్‌ ) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విండీస్‌ లెజెండ్స్ బౌలర్‌ నగముటూ వేసిన 19వ ఓవర్లో యువీ ఏకంగా 4 సిక్సర్లు బాది 24 రన్స్‌ పిండుకున్నాడు. అతని ధాటైన ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు.

ఇక 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ లెజెండ్స్ కూడా ధాటిగానే ఆడుతుంది. ఓపెర్ స్మీత్ (63 పరుగులు,36 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నర్సింగ్ దేవ్‌నారాయణ్‌ (59; 44 బంతుల్లో 5×4, 2×6),తో రెండో వికెట్‌కు 99పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వారిద్ధరు వికెట్లు కోల్పాయక మ్యాచ్ టీమిండియావైపు తిరిగింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారా మెరుపుఇన్నింగ్స్ ఆడాడు. తనలో ఇంకా సత్తా ఉందని నిరుపించాడు. డెత్ ఓవర్లతో వినయ్ కుమార్, పఠాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్ 206 పరుగులకే పరిమితం అయింది. దీంతో ఇండియా లెజెండ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags:    

Similar News