Neeraj Chopra: ఆశలన్నీ నీరజ్ పైనే..పారిస్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడతాడా?

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 13వ రోజున, జావెలిన్ త్రో పతక ఈవెంట్‌లో పాల్గొననున్న నీరజ్ చోప్రాపై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. స్పెయిన్‌తో జరిగే కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు..స్వర్ణం దిశగా దూసుకెళ్లి...అనూహ్యంగా సెమీస్ లో నిష్క్రమించారు. కాంస్యం కోసం పోరాడనున్నారు. వినేశ్ ఫొగాట్ అనూహ్య రీతిలో అనర్హత వేటు పడి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మన ఆశలన్నీ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. టోక్యోలో స్వర్ణంతో హిస్టరీ క్రియేట్ చేసిన నీరజ్..పారిస్ లోనూ మరో పసిడితో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడతాడా?

Update: 2024-08-08 04:25 GMT

 Neeraj Chopra: ఆశలన్నీ నీరజ్ పైనే..పారిస్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడతాడా? 

Paris Olympics 2024: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలలో 12 రోజులు ముగిసిన తర్వాత, భారతదేశం ఇప్పటివరకు కేవలం 3 పతకాలు మాత్రమే గెలుచుకుంది. అవి వివిధ షూటింగ్ ఈవెంట్‌లలో వచ్చిన పథకాలు. 12వ రోజు, వినేష్ ఫోగట్ పతకాన్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తుందని యావత్ భారత్ ఎంతో ఆశగా ఎదురుచూసింది. కానీ అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటుపడింది.

దీంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో మీరాబాయి చాను నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో 13వ రోజున, అందరి దృష్టి రెండు ఈవెంట్‌లపైనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టి నీరజ్ చోప్రాపైనే ఉంది. జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ పసిడితో మెరిసిపోతాడని ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.

మూడేండ్ల క్రితం పెద్దగా అంచనాలు లేని సమయంలో ఏదొక పతకం రావడమే గొప్పగా భావించిన పరిస్థితుల్లో డైరెక్ట్ పసిడిపైనే గురి పెట్టి సంచలన విజయం నమోదు చేశాడు నీరజ్ చోప్రా. ఇప్పుడు పారిస్ లోనూ అతనిమీద భారీ అంచనాలే నెలకున్నాయి. క్వాలిఫికేషన్ లోఅద్బుతమైన ప్రదర్శన ఇవ్వడంతో ఇప్పుడు ఆశలు ఇంకా పెంచేశాడు. వినేశ్ పై అనర్హత వేటు పడటంతో నిరాశలో మునిగిన అభిమానులకు నీరజ్ ఇప్పుడు ఆశలు కలిగించాడు.

అయితే నీరజ్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అంచనాలను తారుమారు చేస్తూ టార్గెట్ రీచ్ అవ్వడం నీరజ్ కు వెన్నతో పెట్టిన విద్యలాంటింది. క్వాలిఫికేషన్లో ఒకే ఒక్క త్రోనే బల్లెన్నీ విసిరి ఫైనల్ కు చేరిన ఘనత నీరజ్ అకౌంట్లో ఉంది.

అయితే ఫైనల్లో నీరజ్ ప్రత్యేర్థులేమీ మామూలోరు కాదు. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ అండర్సన్ ఫిటర్సన్ తోపాటు జులియెస్ యోగో, వాద్లెజ్ లకు నీరజ్ కంటే పెద్ద రికార్డే ఉంది. అయినా కూడా పోటీ రోజు ఎవరు ఉత్తమ ప్రదర్శన చేస్తారన్నదే కీలకం.

కాబట్టి నీరజ్ మరోసారి ఛాంపియన్ గా నిలచే ఛాన్స్ కనిపిసోంది. నేడు తుదిపోరూలోనూ నీరజ్ పై సాధించి పసిడి గెలవాలని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు. పరిస్థితులు కలిసి రాకుంటే ఏదొక పతకం తన ఖాతాలో పడటం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News