IPL 2025: నేడు ఆర్సిబీతో ముంబై బిగ్ ఫైట్...ఆ డేంజర్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు
IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు రసవత్తర ఫైట్ ఉండనుంది. ముంబై సొంత మైదానంలోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. ఎప్పటి వలే రాత్రి 7.30గంటల ప్రాంతంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచులో మొదటి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గాయంతో గత కొన్నాళ్లుగా ముంబైకి దూరంగా ఉన్న బుమ్రా తాజాగా జట్టులో చేరిపోయాడు. నేటి మ్యాచ్ కూడా ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నేటి మ్యాచులో ఆడకపోతే ఈ వారం చివరిలో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అప్పుడైనా బుమ్రా ఆడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఇక ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్ లు జరిగాయి. దీనిలో బెంగళూరు 14 మ్యాచులు గెలిచింది. ముంబై ఇండియన్స్ 19 మ్యాచులు విజయం సాధించింది. మరి నేడు ఎవరు గెలుస్తారో చూడాల్సిందే.