IPL 2025: ఐపీఎల్‌లో ఈసారి CSK, MIకి కష్టకాలం! ధోని, రోహిత్ లేని లోటు స్పష్టం!

PL 2025: ఎవరు గొప్ప ? ఎంఎస్ ధోనినా లేక చెన్నై సూపర్ కింగ్స్ (CSK)నా? రోహిత్ శర్మనా లేక ముంబై ఇండియన్స్ (MI)నా? ఒకే ఒక్క నిర్ణయం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేసింది.

Update: 2025-04-10 09:23 GMT
IPL Giants CSK, MI in Trouble Dhoni-Rohits Absence Costing Dearly

PL 2025: ఐపీఎల్‌లో ఈసారి CSK, MIకి కష్టకాలం! ధోని, రోహిత్ లేని లోటు స్పష్టం!

  • whatsapp icon

IPL 2025: ఎవరు గొప్ప ? ఎంఎస్ ధోనినా లేక చెన్నై సూపర్ కింగ్స్ (CSK)నా? రోహిత్ శర్మనా లేక ముంబై ఇండియన్స్ (MI)నా? ఒకే ఒక్క నిర్ణయం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేసింది. ధోని, రోహిత్ తమ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదా తప్పించబడటంతో CSK, MI ముఖాలపై ఉన్న ముసుగు తొలగిపోయింది. ఇక్కడ ముసుగు అంటే ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల విజయాల పరంపర. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన ఈ రెండు జట్లు, ధోని, రోహిత్ కెప్టెన్సీ వదిలేశాక మాత్రం దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. ధోని, రోహిత్ కెప్టెన్‌లుగా లేనిప్పటి నుండి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ విజయాల్లో భారీ పతనం కనిపించింది. మరి ఈ రెండు జట్ల కొత్త సారథులు అంత ప్రభావవంతంగా లేరా?

ధోని, రోహిత్ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత

ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వదిలినప్పటి నుండి, పసుపు జెర్సీ ధరించిన ఈ జట్టు తమ 68 శాతం మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. అంటే కేవలం 42 శాతం మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. దీని కంటే దారుణంగా ఉంది రోహిత్ శర్మ కెప్టెన్సీ నుండి తప్పుకున్న తర్వాత ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఆ జట్టు కేవలం 26 శాతం మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది.

కొత్త సారథులు ప్రభావం చూపలేదా?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే చెన్నై, ముంబై కొత్త సారథులు, అంటే కొత్త కెప్టెన్లు ఏమి చేస్తున్నారు? ధోని తప్పుకున్న తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ చేపట్టాడు. రుతురాజ్ కెప్టెన్‌గా ఉన్న 19 మ్యాచ్‌లలో చెన్నై జట్టు 8 మ్యాచ్‌లలో గెలిచి, 11 మ్యాచ్‌లలో ఓడిపోయింది.

ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే, రోహిత్ శర్మ కెప్టెన్సీ నుండి తప్పుకున్న తర్వాత ఆ జట్టు పగ్గాలు హార్దిక్ పాండ్యా చేతికి వెళ్లాయి. పాండ్యా కెప్టెన్‌గా ముంబై ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడగా, గెలిచిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌లలో ఓడిపోయింది. హార్దిక్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆడిన 22 మ్యాచ్‌లలో కేవలం 7 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించి, 15 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది.

కోట్లాది రూపాయల ఆదాయానికి ముప్పు

ధోని, రోహిత్ కెప్టెన్సీ వదిలేసిన నిర్ణయం కేవలం చెన్నై, ముంబై ప్రదర్శనపై మాత్రమే కాదు.. వారి కోట్లాది రూపాయల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు గెలిచిన జట్టుకు కోట్లాది రూపాయలు బహుమతిగా లభిస్తాయి. ఐపీఎల్ 2025 విజేతకు లభించే ప్రైజ్ మనీ 20 కోట్ల రూపాయలు. కానీ, ఇప్పటివరకు చెన్నై, ముంబై ఆడిన తీరు చూస్తుంటే, వారు విజేతలుగా నిలవడం మాట దేవుడెరుగు, ఫైనల్ లేదా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కూడా కష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News