SRH: ఇంత బలుపు ఎందుకు బ్రో.. సన్‌రైజర్స్‌ హీరోపై దారుణ ట్రోలింగ్‌!

SRH: రాజస్థాన్ రాయల్స్‌పై 67 పరుగులు, లక్నోపై 47 పరుగులు చేసిన హెడ్... తర్వాతి మూడు ఇన్నింగ్స్‌లో వరుసగా 22, 4, 8 పరుగులతో పెవిలియన్‌కు పరిమితమయ్యాడు.

Update: 2025-04-09 17:36 GMT
SRH

SRH: ఇంత బలుపు ఎందుకు బ్రో.. సన్‌రైజర్స్‌ హీరోపై దారుణ ట్రోలింగ్‌!

  • whatsapp icon

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఇటీవల హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్‌లో ఫ్యాన్‌తో జరిగిన ఘటన వల్ల ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో పాల్గొంటున్న సమయంలో మాల్‌లో షాపింగ్ చేస్తూ ఉన్న హెడ్‌ను ఓ యువతి సెల్ఫీ కోసం అడగగా, అతడు అంగీకరించలేదు. ఆ తర్వాత మరొక యువకుడు సెల్ఫీ కోసం ట్రావిస్‌ని వెంటాడుతూ పలుమార్లు అభ్యర్థించాడు. తన అభ్యర్థనను పదేపదే తిరస్కరిస్తూ ముందుకు నడుస్తున్న హెడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అభిమానులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తూ, తమను అవమానించాడని, హైదరాబాదీయుల మద్దతు ఉన్నా స్పందన ఇవ్వకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ ఫామ్ కూడా దారుణంగా పడిపోయింది. ఐపీఎల్‌లో మొదటి రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన అతడు, ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా తక్కువ స్కోర్లకు అవుట్ అవుతూ ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 67 పరుగులు, లక్నోపై 47 పరుగులు చేసిన హెడ్... తర్వాతి మూడు ఇన్నింగ్స్‌లో వరుసగా 22, 4, 8 పరుగులతో పెవిలియన్‌కు పరిమితమయ్యాడు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్‌లో 148 పరుగులు చేసిన అతడి స్ట్రైక్‌రేట్ 189.74గా ఉన్నప్పటికీ, సరైన కాన్సిస్టెన్సీ కనిపించడం లేదు.

ఇక ట్రావిస్ పేలవ ఫామ్‌తో పాటు SRH జట్టు కూడా వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. మొదటి మ్యాచ్‌ను గెలిచిన తర్వాత వారు ఒక్క విక్టరీ కూడా సాధించలేకపోయారు. ఐదు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున కొనసాగుతోంది. అభిమానుల నిరాశ, ఆటతీరు పైన ఒత్తిడి ఇలా అన్నింటి మధ్య ట్రావిస్ హెడ్ మానసికంగా కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా ఆయన పబ్లిక్ ప్లేస్‌లో అభిమానుల అభ్యర్థనకు సమాధానం ఇవ్వకపోవచ్చు. కానీ ఇది కొందరిలో అసహనానికి దారి తీసింది.

Tags:    

Similar News