Anaya Bangar: క్రికెటర్ టు డ్యాన్సర్! అనయా బంగర్ కొత్త టాలెంట్ చూశారా?
Anaya Bangar: భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కొడుకు ఇప్పుడు అమ్మాయిగా మారిపోయిన విషయం తెలిసిందే.

Anaya Bangar: క్రికెటర్ టు డ్యాన్సర్! అనయా బంగర్ కొత్త టాలెంట్ చూశారా?
Anaya Bangar: భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కొడుకు ఇప్పుడు అమ్మాయిగా మారిపోయిన విషయం తెలిసిందే. ఆమె పేరు అనయా బంగర్. తాజాగా అనయా తన డ్యాన్స్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన డ్యాన్స్ మూవ్స్‌ను అందరితో పంచుకుంది. ఆ డ్యాన్స్ చూస్తే ఎవరైనా సరే.. బాలీవుడ్‌లోని తమన్నా, కత్రినా కైఫ్ లేదా మలైకా అరోరాలకు ఏ మాత్రం తీసిపోదని అనక మానరు. ఆ హీరోయిన్ల డ్యాన్స్ ఎంత బాగుంటుందో, అనయా బంగర్ డ్యాన్స్ కూడా అంతే అద్భుతంగా ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ వీడియో షేర్ చేసిన అనయా
అనయా బంగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె తన స్నేహితురాలితో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. డ్యాన్స్‌లో ఆమె స్నేహితురాలు లీడ్ చేస్తూ ఉంటే, అనయా ఆమెను అనుసరిస్తూ డ్యాన్స్ చేసింది. ఆ వీడియో చూస్తుంటే వీళ్లిద్దరూ ఏదో డ్యాన్స్ షో కోసం ప్రిపేర్ అవుతున్నట్లు అనిపిస్తోంది.
అమ్మాయిగా మారిన అనయా
సంజయ్ బంగర్ కొడుకు ఇంగ్లాండ్‌లో హార్మోన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని అమ్మాయిగా మారింది. ఇంతకుముందు ఆర్యన్ బంగర్‌గా అందరికీ తెలిసిన సంజయ్ బంగర్ కొడుకు, అమ్మాయిగా మారిన తర్వాత ఇప్పుడు అనయా బంగర్‌గా గుర్తింపు పొందింది. అనయా కొన్ని రోజుల క్రితమే ఇంగ్లాండ్ నుండి ఇండియాకు తిరిగి వచ్చింది. ఇండియాకు రాగానే మొదట తన జుట్టును స్ట్రెయిట్ చేయించుకున్న వీడియోను షేర్ చేసింది.
ఇండియాకు వచ్చిన తర్వాత అనయా బంగర్ ఇక్కడి సాంప్రదాయ అమ్మాయిల దుస్తులు ధరించి చాలా సంతోషంగా కనిపించింది. సల్వార్ కమీజ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ తనకు భారతీయ సంప్రదాయ దుస్తులంటే చాలా ఇష్టమని రాసుకొచ్చింది. సంజయ్ బంగర్ కొడుకు అమ్మాయిగా మారకముందు ఇంగ్లాండ్ తరపున క్లబ్ లెవెల్ క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. అండర్ ఏజ్ క్రికెట్ టోర్నమెంట్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి కూడా ఆడాడు. కానీ ఆర్యన్ కాస్తా అనయాగా మారడంతో క్రికెటర్‌గా ఉన్న ఆ గుర్తింపు కూడా పోయింది.