ఐపిఎల్‌లో ఫస్ట్ బంతికే వికెట్ తీసిన అశ్వని కుమార్... ఫుల్‌ఫామ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్స్

MI vs KKR Highlights: ముంబై ఇండియన్స్ జట్టు ఐపిఎల్ 2025 లో ఇంకా బోణీ కొట్టలేదు.

Update: 2025-03-31 14:55 GMT

ఐపిఎల్‌లో ఫస్ట్ బంతికే వికెట్ తీసిన అశ్వని కుమార్... కోల్‌కతాను టెన్షన్ పెట్టిన ముంబై ఇండియన్స్

MI vs KKR match : ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ ద్వారా అశ్వని కుమార్ అనే కొత్త ఆటగాడు ఐపిఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపిఎల్‌లో వేసిన ఫస్ట్ ఓవర్‌లో ఫస్ట్ బంతికే కోల్‌కతా ఆటగాడు అజింక్య రహానే వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్స్ దీపక్ చాహర్, కొత్త బౌలర్ అశ్వని కుమార్ ఫుల్‌ఫామ్‌లో కనిపిస్తున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టు ఐపిఎల్ 2025 లో ఇంకా బోణీ కొట్టలేదు. ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబై ఓడిపోయింది. అందుకే ఈ మ్యాచ్‌లోనైనా ఎలాగైనా గెలవాలనే కసి ఆ జట్టులో కనిపిస్తోంది. అందుకు తగినట్లుగానే ఆ జట్టుకు శుభారంభం ఎదురైంది.

తొలి 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికే ముంబై ఇండియన్స్ బౌలర్లు 4 వికెట్లు తీసుకున్నారు. సునిల్ నరైన్, క్వింటన్ డికాక్, అజింక్య రహానే, రఘువంశి తక్కువ స్కోర్లకే వెనువెంటనే ఔట్ అయ్యారు. అప్పటికి జట్టు మొత్తం స్కోర్ 33 పరుగులుగానే ఉంది.

ముంబై ఇండియన్స్ జట్టు ఆ దూకుడు అలానే కొనసాగించి 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ వెంకటేశ్ అయ్యర్‌ను కూడా ఔట్ చేసి మరో వికెట్ తమ ఖాతాలో వేసుకుంది. అప్పటికి జట్టు పరుగులు 45 పరుగులే. ముంబై దూకుడు ఇలానే కొనసాగితే కోల్‌కతా నైట్ రైడర్స్ అతి తక్కువ స్కోర్‌కే చాప చుట్టేసే అవకాశాలు ఉన్నాయి.   

Tags:    

Similar News