IPL 2025: కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ గురించి డివిలియర్స్ ఏమన్నారంటే ?
IPL 2025: ఆర్‌సిబి ఇంత వరకు ఐపీఎల్ కప్పు ఒక్కసారిగా కూడా కొట్టలేదు. దీంతో ఆటగాళ్లు, అభిమానులు ఐపిఎల్ 18వ సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

IPL 2025: కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ గురించి డివిలియర్స్ ఏమన్నారంటే ?
IPL 2025: ఆర్‌సిబి ఇంత వరకు ఐపీఎల్ కప్పు ఒక్కసారిగా కూడా కొట్టలేదు. దీంతో ఆటగాళ్లు, అభిమానులు ఐపిఎల్ 18వ సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సమయంలోనే మాజీ క్రికెటర్ ఎబి డివిలియర్స్ ఆ జట్టుకు ఓ సలహా ఇచ్చారు. ప్రస్తుత సీజన్‌లో విరాట్ కోహ్లీని బ్యాటింగ్ కెప్టెన్‌గా చేయాలని ఆయన అన్నారు. ఈ టోర్నమెంట్‌లో విరాట్ బ్యాటింగ్ విభాగానికి కెప్టెన్ పాత్ర పోషించాలని డివిలియర్స్ అన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోకుండా ఉండే బాధ్యత తను తీసుకోవాలి.
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ స్మార్ట్ క్రికెట్ ఆడటం, ఆటను కంట్రోల్ చేయడం మీద దృష్టి పెట్టాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సీనియర్ ఆటగాడు డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. ఆర్‌సిబిలో ఫిల్ సాల్ట్ లాంటి ఆటగాడు ఉండడం వల్ల విరాట్‌పై ఒత్తిడి తగ్గుతుందని, తద్వారా అతను మరింత స్వేచ్ఛగా ఆడగలడని డివిలియర్స్ అన్నారు. గత రెండు సీజన్లలో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి చర్చ జరిగింది. అయితే, ఈ సీజన్‌లో RCB జట్టులో ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియాకు చెందిన టిమ్ డేవిడ్, వెస్టిండీస్‌కు చెందిన రొమారియో షెపర్డ్ వంటి దూకుడు బ్యాట్స్‌మెన్‌లను చేర్చుకుంది. ఈ ఆటగాళ్ల ఉనికి విరాట్‌కు మరింత స్వేచ్ఛను ఇస్తుందని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు.
ఈ సీజన్‌లో ఆర్‌సిబి బలమైన జట్టును కలిగి ఉందని డివిలియర్స్ అన్నారు. అయితే, జట్టులో ఎక్స్-ఫ్యాక్టర్ స్పిన్నర్ లేడని అతను అంగీకరించాడు. 'కృనాల్ పాండ్యా గొప్ప స్పిన్నర్, అతను బ్యాటింగ్‌లో కూడా సహాయం చేయగలడు' అని ఆయన అన్నారు. ఈ సీజన్‌లో RCB బలమైన జట్టును కలిగి ఉందని, సరైన వ్యూహంతో ఆడితే వారు తమ మొదటి IPL టైటిల్‌ను గెలుచుకోగలరని AB డివిలియర్స్ విశ్వసిస్తున్నారు.