IPL 2025: ఐపీఎల్ 2025 లో శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ
IPL 2025: ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈఇడెన్ గార్డెన్స్ లో జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్ లో కెకెఆర్ జట్టు ఆర్ సిబి జట్టుతో తలపడనుంది. ప్రస్తుతం వారు తొలి టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు.

IPL 2025: ఐపీఎల్ 2025 లో శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ
IPL 2025: ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈఇడెన్ గార్డెన్స్ లో జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్ లో కెకెఆర్ జట్టు ఆర్ సిబి జట్టుతో తలపడనుంది. ప్రస్తుతం వారు తొలి టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా మొదటి సీజన్ నుంచి ఈ జట్టుతోనే ఉన్నారు. ఈసారి జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడానికి వారు తన శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఈ సీజన్ లో అతను శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
శిఖర్ ధావన్ గతేడాది వరకు ఐపీఎల్ లో ఆడాడు. కానీ కొంతకాలం క్రితం క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మన్ గా శిఖర్ ధావన్ నిలిచాడు. కానీ ఈ సీజన్‌లో అతని ఈ రికార్డును విరాట్ కోహ్లీ మాత్రమే బద్దలు కొట్టగలడు.
ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్. ఐపీఎల్‌లో ఆడిన 222 మ్యాచ్‌ల్లో 221 ఇన్నింగ్స్‌ల్లో 768 ఫోర్లు కొట్టాడు. అతను ఐపీఎల్‌లో 6769 పరుగులు చేశాడు. ఈ జాబితాలో అతని తర్వాత రెండవ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ IPL 2025లో ఆడుతున్నాడు.
ఆర్‌సిబి ఆటగాడు విరాట్ కోహ్లీ ధావన్ రికార్డును బద్దలు కొట్టి ఐపిఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా మారగలడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 705 ఫోర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అతను సీజన్ బాగా ఆడితే ధావన్ రికార్డును బద్దలు కొట్టగలడు. ధావన్ కంటే కోహ్లీ 64 ఫోర్ల దూరంలో ఉన్నాడు. కానీ గత సీజన్‌ను పరిశీలిస్తే కోహ్లీకి ఇదంట పెద్ద కష్టమేమీ కాదు.
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ మొత్తం 62 ఫోర్లు కొట్టాడు. ఆ సీజన్‌లో అతను 741 పరుగులు చేశాడు. గత సీజన్ (2023)లో విరాట్ కోహ్లీ మొత్తం సీజన్‌లో 65 ఫోర్లు కొట్టాడు. ఒకే సీజన్‌లో గరిష్ట సంఖ్యలో ఫోర్ల గురించి మాట్లాడుకుంటే..విరాట్ కోహ్లీ 2016లో 83 ఫోర్లు కొట్టాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్లో తను 252 మ్యాచ్‌ల్లో 8004 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ విరాట్.