IPL 2020: చా'హల్ చల్'
IPL 2020: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణీ చేసింది. యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనిలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ జట్టును పది పరుగుల తేడాతో ఓడించగలిగింది.
IPL 2020: ఐపీఎల్ 2020లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణీ చేసింది. యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనిలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ జట్టును పది పరుగుల తేడాతో ఓడించగలిగింది. సోమవారం జరిగిన ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్ 19.4 ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేసి సన్‌రైజర్స్ జట్టు కుప్ప కూలింది.
ఆర్సీబీ విజయంలో చాహల్ దే కీలక పాత్ర అని చెప్పడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు. సన్‌రైజర్ 16 ఓవర్ వరకు 121 చేసి కేవలం 2 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో చాహల్ తన బంతితో మ్యాజిక్ చేశాడు. అదే తరహాలో శివం దుబే, సైని చెలరేగారు. చివరి ఓవర్లలో 32 పరుగులకు ఎనిమిది వికెట్లను పడగొట్టి .. అనూహ్యంగా విజయం సాధించారు.
సన్‌రైజర్స్ జట్టుకు మంచి ఓపెనింగ్ లభించలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. అయినా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన జాన్ బెయిర్‌స్టో మనీశ్ పాండేతో కలిసి రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. ఇందులో మనీశ్ పాండే 33 బంతుల్లో 34 పరుగులు చేయగా, బెయిర్‌స్టో 37 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశారు. సన్‌రైజర్ కచ్చితంగా గెలుస్తుందని అందరూ భావించారు. ఈ తరుణంలో బౌలింగ్ కు వచ్చిన చాహాల్ తన స్పిన్ మాయాజాలంతో హల్ చల్ చేశాడు. 16.2 ఓవర్‌లో అద్భుతమైన బంతిని వేసి మనీశ్ పాండే ను అవుట్ చేశారు.
ఆర్సీబీ ఇచ్చిన మూడు లైఫ్ ను చక్కగా సద్వినియోగం చేసుకున్న బెయిర్‌స్టో 43 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేశాడు. అయితే అతని దూకుడుకు చాహల్ బ్రేక్ వేశాడు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన విజయ్‌శంకర్‌ను ఖాతా కూడా తెరవకుండా తరువాతి బంతితో చాహల్ అవుట్ చేశాడు. ఇలా చాహాల్ నాలుగు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
అనంతరం.. శివం దుబే 17వ ఓవర్లో ప్రియంగార్గ్(12)ను పెవిలియన్‌కు పంపాడు.. అదే ఓవర్‌లో అభిషేక్ శర్మ(1) రనౌట్ అయ్యాడు. అలాగే.. గాయపడిన సీన్ మార్ష్ ఖాతా తెరవలేక పోయాడు. చివరికి సందీప్‌శర్మ వికెట్ తీసి డేల్ స్టెయిన్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.