IPL 2020: ర‌షీద్ ఖాన్‌ది హిట్ వికెట్ కాదంట‌!

IPL 2020: ఐపీఎల్ 2020 భాగంగా దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ త‌ల‌ప‌డ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణ‌యించిన (168 పరుగులు) ల‌క్ష్య చేధ‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట్మెన్స్ త‌డ‌బ‌డ్డారు

Update: 2020-10-14 07:17 GMT

ర‌షీద్ ఖాన్‌ది హిట్ వికెట్ కాదంట‌!

IPL 2020: ఐపీఎల్ 2020 భాగంగా దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ త‌ల‌ప‌డ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణ‌యించిన (168 పరుగులు) ల‌క్ష్య చేధ‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట్మెన్స్ త‌డ‌బ‌డ్డారు. చివ‌రి వ‌ర‌కూ ఈ మ్యాచ్ ఉత్కంఠ‌గా సాగింది. సన్‌రైజర్స్ విజయం సాధించాలంటే 12 బంతుల్లో 27 పరుగులు చేయాలి. 19వ ఓవర్ చేసేందుకు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌కు దిగాడు.

మొదటి బంతికి రషీద్ ఖాన్ రెండు పరుగులు, రెండో బంతిని వైడ్ యార్కర్‌గా. ఆ తరువాతి బంతి డాట్ బాల్, ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు సింగిల్స్.  దీంతో రన్‌రేట్ అమాంతం పెరిగిపోయింది. శార్దుల్ ఠాకూర్ చివరి బంతిని లో ఫుల్ టాస్ వేయగా.. రషీద్ ఖాన్ వికెట్లను దగ్గరగా వెళ్లి హెలికాప్టర్ షాట్ ఆడాడు. కానీ ఇక్క‌డే ఓ విచిత్రం జ‌రిగింది. షాట్ ఆడే క్రమంలో రషీద్ ఆఫ్ స్టంప్‌ని కాలితో తొక్కేశాడు. అప్పుడే అతడు హిట్‌ వికెట్‌గా ఔట్ అయ్యాడు. మరో వైపు  చహర్ క్యాచ్ కూడా పట్టడంతో ఒకే బంతికి రెండు సార్లు ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. 'ర్యాన్ డి సా' అనే అభిమాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ముందుగా రషీద్ పాదం వికెట్లను తాకింది కాబట్టి.. హిట్ వికెట్ రూపంలో ఔటైనట్లు ప్రకటించారు. కానీ క్రికెట్ చట్టాల (ఎంసీసీ లాస్ ఆఫ్ క్రికెట్) మాత్రం మరో విధంగా ఉన్నాయి. లా 33.1 ప్రకారం బ్యాట్స్‌మెన్ బౌల్డ్ కాకుండా క్యాచ్ రూపంలో ఔటైతే.. మరో రూపంలో ఔటయినా క్యాచ్‌గానే పరిగణిస్తారు. కాబట్టి హిట్ వికెట్‌ కంటే క్యాచ్ ఔట్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఐపీఎల్ 2020 భాగంగా గత నెల 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా హిట్‌ వికెట్ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ 11 మంది హిట్ వికెట్ రూపంలో ఔటయ్యారు.


Tags:    

Similar News