IPL 2020: ఈ మ్యాచ్ నాకు డూ ఆర్ డై లాంటిది: విజయ్ శంకర్
IPL 2020: సన్‌రైజర్ ఆటగాడు విజయ్ శంకర్. అల్ రౌండర్ అయినప్పటికీ.. ఏ రోజు కూడా ఇటు బంతితో గానీ, బ్యాట్ తో గానీ ఆకట్టుకున్న దాఖాల్లేవు. ముందు మ్యాచ్‌ల్లో కూడా అంతగా రాణించిన సందర్బాలు కూడా లేవు.
IPL 2020: సన్‌రైజర్ ఆటగాడు విజయ్ శంకర్. అల్ రౌండర్ అయినప్పటికీ.. ఏ రోజు కూడా ఇటు బంతితో గానీ, బ్యాట్ తో గానీ ఆకట్టుకున్న దాఖాల్లేవు. ముందు మ్యాచ్‌ల్లో కూడా అంతగా రాణించిన సందర్బాలు కూడా లేవు. కానీ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం మనీష్ పాండేకు చక్కని సహాకారం అందిస్తూ.. హాఫ్ సెంచరీతో ఆజేయంగా నిలిచి, జట్టును గెలిపించాడు. పాండే దూకుడు ఆడగా.. విజయ్ శంకర్ మాత్రం నెమ్మదిగా వికెట్ పడకుండా ఆడాడు. కుదురుకున్న తరువాత దుమ్ము లేపాడు. జోఫ్రా ఆర్చర్‌ను విజయ్ హడలెత్తించాడు. అతని బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి ఆశ్చర్య పరిచాడు. వరుస బౌండరీలు బాదడంతో ఆర్చర్ కు చుక్కులు చూపించాడు.
మొదటి రెండు ఓవర్లలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలను ఔట్ చేసిన జోఫ్రా ఆర్చర్..సన్‌రైజర్స్ జట్టును కష్టాల్లోకి నెట్టి వేశాడు. ఇక 12వ ఓవర్లో బౌలింగ్ చేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడు ఓవర్లలో 8 రన్స్ మాత్రమే ఇచ్చిన ఆర్చర్.. పాండే, విజయ్‌ల భాగస్వామ్యాన్ని ఏలాగై బ్రేక్ చేయాలని 16వ ఓవర్ వేశాడు. కానీ ఈ ఓవర్లో విజయ్ శంకర్‌కు బలయ్యాడు. తేలిపోయాడు. మనీష్ పాండేకు ఛాన్స్ ఇవ్వకుండా ఆ ఓవర్ మొత్తం విజయే బ్యాటింగ్ చేశాడు. హ్యాట్రిక్ ఫోర్లతో ఆర్చర్‌ను హడలెత్తించాడు. తొలి బంతిని మిడాఫ్ దిశగా ఫోర్ కొట్టాడు. రెండో బంతిని మిడాన్ వైపు, మూడో బంతిని లాంగ్ ఆన్ మీదుగా ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. దీంతో ఒకే ఓవర్‌లో 13 పరుగులు సాధించాడు. వరుస బౌండరీలతో ఈ సమయంలో స్టీవ్ స్మిత్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం విజయ్ శంకర్ బౌండరీలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
మ్యాచ్ అనంతరం విజయ్ శంకర్ మాట్లాడుతూ...ఈ మ్యాచ్ నాకు డూ ఆర్ డై లాంటిది. ఈ సీజన్లో ఇంతకు ముందు 18 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్నాను. ఇది మంచి ఛాలెంజ్. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం కోసం ఎదురు చూస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో రాణిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నాడు. అలాగే ఆర్చర్ బౌలింగ్ లో ఫోర్ల గురించి మాట్లాడుతూ.. మొదట క్రీజులో కుదురుకోవాలనుకున్నాం. మ్యాచ్ చివరి దశకు చేరుకున్నది. బౌలర్ ఎవ్వరది పట్టించుకోలేదు. అందుకే దంచి కొట్టాం ' అని తెలిపాడు.