IPL 2020: 'రాకింగ్' రషీద్ ఖాన్
IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 లో నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ పోరులో హైదరాబాద్ విజయం సాధించింది.
IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 లో నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ పోరులో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను సన్ రైజర్స్ టీమ్ 15 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో హైదరాబాద్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ విజయ సాధించడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్, అఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. అద్భుత బౌలింగ్ వేసి.. మూడు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో (0/31), (1/25) తేలిపోయిన రషీద్.. ఈ మ్యాచ్‌తో తన పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ తన నాలుగు ఓవర్ల వేసి.. మూడు వికెట్లు తీసి 14 పరుగులే ఇచ్చాడు. కీలక వికెట్లు అయిన శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్‌ల వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీ పతనంలో కీలక పాత్ర పోషించారు. రషీద్ ఖాన్‌కు తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించారు. భువనేశ్వర్ కుమార్(2/25), ఖలీల్ అహ్మద్(1/43), నటరాజన్ (1/25) అద్భుత యార్కర్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఈ ప్రదర్శనతో రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నారు.
ఈ సమయంలో రషీద్ ఖాన్.. తన జీవితంలో జరిగిన విషాద సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచినప్పుడల్లా మా అమ్మగారు చాలా సంతోష పడేంది. కానీ ఇప్పుడు సంతోషించడానికి అమ్మగారు లేరని కొన్ని నెలల క్రితం చనిపోయింది. గతేడాది నాన్న కూడా చనిపోయారు. ఏడాది కాలంలో అమ్మానాన్నని పోగొట్టుకున్నానని రషీద్ ఖాన్ కంటనీరు తెచ్చుకున్నారు.