IND vs BAN 3rd T20I: ఉప్పల్‌లో టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ఎవరొచ్చారంటే?

India vs Bangladesh, 3rd T20I: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు హైదరాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Update: 2024-10-12 13:17 GMT

India vs Bangladesh, 3rd T20I: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు హైదరాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో మార్పు వచ్చింది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో రవి బిష్ణోయ్‌కి అవకాశం దక్కింది.

రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత జట్టు చూస్తోంది.

బంగ్లాదేశ్‌లో రెండు మార్పులు..

బంగ్లాదేశ్‌లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్లేయింగ్-11లో తంజీద్ హసన్ తమీమ్, మహేదీ హసన్‌లు చోటు దక్కించుకున్నారు.

T-20 ల నుంచి మహ్మదుల్లా రిటైర్మెంట్..

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లాకు నేడు చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్. 38 ఏళ్ల మహ్మదుల్లా రెండో మ్యాచ్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల మహ్మదుల్లా 2021లోనే టెస్టు ఫార్మాట్‌ నుంచి రిటైరయ్యాడు. వన్డేలు ఆడుతూనే ఉంటాడు.

బంగ్లాదేశ్ కేవలం 1 టీ20 మ్యాచ్‌లో మాత్రమే..

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు 16 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 15లో గెలుపొందగా, బంగ్లాదేశ్ ఒక్కదానిలో మాత్రమే గెలిచింది. 2019లో ఢిల్లీ మైదానంలో బంగ్లాదేశ్ ఈ విజయాన్ని అందుకుంది.

ఇరుజట్లు:

భారత్: సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్ (కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తంజిమ్ హసన్ సాకిబ్.

Tags:    

Similar News