IND vs BAN: T20Iల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ.. రెండో భారతీయుడిగా సంజు శాంసన్..

హైదరాబాద్‌లో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు.

Update: 2024-10-12 14:53 GMT

IND vs BAN, 3rd T20I: హైదరాబాద్‌లో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు. అతను 40 బంతుల్లో 9 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో తన తొలి T20I సెంచరీని సాధించాడు. 2017లో శ్రీలంకపై 35 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ తర్వాత స్థానంలో శాంసన్ నిలిచాడు. రోహిత్ ఇన్నింగ్స్ కూడా T20Iలలో అత్యంత వేగవంతమైనది కావడం విశేషం.

భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వార్త రాసే సమయానికి 13 ఓవర్లలో భారత్ 1 వికెట్ నష్టానికి 190 పరుగులు చేసింది. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు. శాంసన్ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిషద్ హుస్సేన్‌పై 10వ ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు.

సూర్య 23 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. శాంసన్ 22 బంతుల్లో యాభై పరుగులు చేశాడు. అతను కెప్టెన్ సూర్యతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా చేశాడు. 4 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.

Tags:    

Similar News