మెల్‌బోర్న్ వీధుల్లో కోహ్లీ, అనుష్క.. వైరల్ అవుతున్న వీడియో..!

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన భార్య అనుష్కతో మెల్‌బోర్న్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.

Update: 2024-12-25 07:21 GMT

మెల్‌బోర్న్ వీధుల్లో కోహ్లీ, అనుష్క.. వైరల్ అవుతున్న వీడియో

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన భార్య అనుష్కతో మెల్‌బోర్న్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదు మ్యాచుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి. ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మరో టెస్టు డ్రాగా ముగిసింది.

గురువారం నుంచి మెల్ బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ టెస్టు కోసం ఇప్ప‌టికే టీమిండియా అక్క‌డికి చేరుకుని ప్రాక్టీస్ మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మ(Anushka Sharma)తో కలిసి మెల్‌బోర్న్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. దీని తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Tags:    

Similar News