IND vs BAN, 3rd T20I: టీ20ఐల్లో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌ నమోదు చేసిన భారత్.. ఎంతంటే?

IND vs BAN, 3rd T20I: శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మూడో T20I సందర్భంగా భారత్ తన ఉమ్మడి అత్యధిక పవర్‌ప్లేను నమోదు చేసింది.

Update: 2024-10-12 15:01 GMT

IND vs BAN, 3rd T20I: శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మూడో T20I సందర్భంగా భారత్ తన ఉమ్మడి అత్యధిక పవర్‌ప్లేను నమోదు చేసింది.

ఇది 2021లో T20 ప్రపంచ కప్‌లో స్కాట్‌లాండ్‌పై స్కోర్ చేసిన 82 పరుగులను సమం చేసింది.

ఆరంభంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మను కోల్పోయిన సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేశారు.

ప్రస్తుతం వార్తలు ముగిసే సరికి టీమిండియా 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. శాంసన్ 111, అభిషేక్ శర్మ 4, సూర్యకుమార్ 75 పరుగులతో పెవిలియన్ చేరారు.

Tags:    

Similar News