INDW vs AUSW: టాస్ ఓడిన భారత్.. సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..

Women T20 World Cup: దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ కొట్టే ప్రయత్నంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ టైలా వ్లెమింక్ కుడి భుజానికి గాయమైంది.

Update: 2024-10-13 13:45 GMT

నేడు, మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడుతోంది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్-11లో భారత జట్టు ఒక్క మార్పు చేసింది. సజ్నా సజీవన్ స్థానంలో పూజా వస్త్రాకర్‌ని తీసుకున్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మధ్యలో ఆస్ట్రేలియా జట్టులో మార్పు జరిగింది. ఫాస్ట్ బౌలర్ టైలా వ్లెమింక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్‌తో ఆడుతుండగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో హీథర్ గ్రాహం ఎంపికైంది. కెప్టెన్ అలిస్సా హీలీ ఫిట్‌నెస్ సమస్యతో ఆస్ట్రేలియా జట్టు కూడా ఇబ్బంది పడుతోంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె కుడి కాలి బొటనవేలికి కూడా గాయమైంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆమె ఆడడంలేదు.

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): బెత్ మూనీ(కీపర్), గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్(కెప్టెన్), జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినెక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.

Similar News