IND vs BAN 3rd T20I: హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ పక్కా..! టీమిండియా గణాంకాలు చూస్తే బంగ్లాకు దిగులే..

India T20 Record in Hyderabad: సిరీస్‌లోని మూడో, చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు హైదరాబాద్‌లో తలపడనున్నాయి.

Update: 2024-10-12 05:02 GMT

IND vs BAN 3rd T20I: హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ పక్కా..! టీమిండియా గణాంకాలు చూస్తే బంగ్లాకు దిగులే..

India T20 Record in Hyderabad: సిరీస్‌లోని మూడో, చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు హైదరాబాద్‌లో తలపడనున్నాయి. బంగ్లాదేశ్‌‌ను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు టీమిండియా బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఉప్పల్‌లో భారత్‌‌ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నేడు హైదరాబాద్‌లో జరిగే చివరి మ్యాచ్‌లోను విజయం తప్పనిసరి అని తెలుస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో సులువైన విజయాలు నమోదు చేసి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు.. మూడో మ్యాచ్‌ని అక్టోబర్ 12న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది.

కీలక ఆటగాళ్లకు విశ్రాంతి..

ఈ టీ20 సిరీస్‌లో భారత్ తన కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించేందుకు భారత్ దూకుడు క్రికెట్ ఆడిన తీరు జట్టు కొత్త వ్యూహాలను తెలియజేస్తోంది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత్, ఇప్పుడు టీ20 సిరీస్‌లో 3-0తో విజయం సాధించేందుకు ఎలాంటి అవకాశాన్ని వదలడంలేదు.

సత్తా చాటుతోన్న యువ ఆటగాళ్లు..

టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం పొందిన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, నితీష్ రెడ్డి సత్తా చాటారు. గాయం కారణంగా IPL 2024 తర్వాత మయాంక్ చాలా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. కానీ, ఈ సిరీస్‌లో అతను 150 kmph వేగంతో బౌలింగ్ చేయడం ద్వారా అద్భుతంగా రాణించాడు. గ్వాలియర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా చక్రవర్తి మూడేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఢిల్లీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 34 బంతుల్లో 74 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా రెండు వికెట్లు తీసిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆటతీరును కూడా మేనేజ్‌మెంట్ నిశితంగా పరిశీలిస్తుంది.

హైదరాబాద్‌లో భారత్‌ రికార్డు ఎలా ఉంది?

ఉప్పల్ మైదానంలో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టు విజేత శాతం 100. భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింట్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2019లో వెస్టిండీస్‌ను ఓడించి, 2022లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించింది. ఈ రికార్డు చూస్తుంటే టీమ్ ఇండియా విజయం 100 శాతం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఈ మైదానంలో అతిపెద్ద T20 అంతర్జాతీయ స్కోరు కూడా టీమిండియా పేరు మీద ఉంది. ఇది వెస్టిండీస్‌పై ఛేజింగ్ చేస్తున్న సమయంలో నమోదైంది. వెస్టిండీస్ 207 పరుగులకు సమాధానంగా భారత్ 209 పరుగులు నమోదు చేసి విజయం సాధించింది.

రెండు జట్ల స్క్వాడ్‌లు..

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా , మయాంక్ యాదవ్, తిలక్ వర్మ.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తంజీద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ అమోన్, తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, లిటన్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహమాన్, తస్కిన్, తస్కిన్, తస్కిన్, తస్కిన్, సాకిబ్, రకీబుల్ హసన్.

Tags:    

Similar News