సెహ్వాగ్ నుంచి బ్రూక్ వరకు.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీలతో దడ పుట్టించిన ప్లేయర్లు.. టాప్ ప్లేస్‌లో మనోడే..!

Fastest Triple Century Record: టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేయడం అంటే ఎంతో మంది బ్యాటర్ల కల.

Update: 2024-10-13 08:30 GMT

సెహ్వాగ్ నుంచి బ్రూక్ వరకు.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీలతో దడ పుట్టించిన ప్లేయర్లు.. టాప్ ప్లేస్‌లో మనోడే..!

Fastest Triple Century Record: టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేయడం అంటే ఎంతో మంది బ్యాటర్ల కల. అయితే, ఇప్పటి వరకు ఇలాంటి మైలురాయిని కొంతమంది బ్యాటర్లు మాత్రమే చేరుకున్నారు. దిగ్గజాలుగా పేరుగాంచిన ఎంతోమంది ఈ లిస్టులో పేరు దక్కించుకోలేకపోయారు. తాజాగా ముల్తాన్‌లో పాకిస్థాన్‌పై హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ చేసి సెహ్వాగ్‌ని గుర్తు చేసిన సంగతి తెలిసిందే. 2004లో సెహ్వాగ్ ఇదే మైదానంలో ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డులో చేరిన టాప్-5 బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

వీరేంద్ర సెహ్వాగ్ ముల్తాన్ రికార్డును హ్యారీ బ్రూక్ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ విషయంలో సెహ్వాగ్ రికార్డ్ మాత్రం చెక్కుచెదరలేదు. అతను దక్షిణాఫ్రికాపై చెన్నైలో 304 బంతుల్లో 42 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 319 పరుగులు చేశాడు. అందులో అతని స్ట్రైక్ రేట్ 104.93లుగా ఉంది. సెహ్వాగ్ 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.

ఈ జాబితాలో హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. మాథ్యూ హేడెన్ రికార్డును బ్రూక్ బద్దలు కొట్టాడు. 300 మార్కును చేరుకోవడానికి బ్రూక్ 310 బంతులు వెచ్చించాడు. పాకిస్థాన్‌పై 322 బంతుల్లో 317 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ 823 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇంగ్లండ్ లెజెండ్ వాలీ హమ్మండ్ మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 355 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అది 1933లో హమ్మండ్‌కి అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ.

నాలుగో ఆటగాడిగా ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ నిలిచాడు. 2003లో జింబాబ్వేపై 362 బంతుల్లో 380 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 38 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. హేడెన్ 362 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

ఇక 5వ స్థానంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ పేరు చేరింది. ముల్తాన్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో 5వ స్థానంలో నిలిచాడు. 309 పరుగులు చేసిన తర్వాత 'సుల్తాన్ ఆఫ్ ముల్తాన్' అనే ట్యాగ్‌ను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వీరూ 364 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Tags:    

Similar News